చంద్రబాబు, జగన్‌లలో ఉగాది కలిసొచ్చేదెవరికి.?

చంద్రబాబు, జగన్‌లలో ఉగాది కలిసొచ్చేదెవరికి.?

ఉగాది.. తెలుగువారి తొలి పండుగ. ఈ తొలి పండుగే పార్టీలకు కూడా అతిపెద్ద పండుగ కాబోతుంది. ఎందుకంటే.. పోలింగ్‌కు ముందు వస్తున్న ఫస్ట్‌ పండుగ ఇదే. దీంతో. ఈ పండుగ నాడు వీలైనంతగా ప్రచారం చేసి ఓట్లను దండుకోవాలని అటు టీడీపీ, ఇటు వైసీపీ ప్లాన్‌ చేస్తున్నాయి. ఉగాది తర్వాత పార్టీలకు ప్రచారం చేసే అవకాశం 48 గంటలు మాత్రమే ఉంటుంది.

మరోవైపు ఉగాది పండుగ రోజే టీడీపీ, వైసీపీ తమ మేనిఫెస్టోలను విడుదల చెయ్యాలని నిర్ణయించాయి. లెక్క ప్రకారం టీడీపీ ఎప్పుడో తమ మేనిఫెస్టో రిలీజ్‌ చేయాల్సి ఉంది. కానీ జగన్‌ ఎక్కడ తమ మేనిఫెస్టోలోని అంశాలను ఉపయోగించుకుని.. వాటికన్నా ఎక్కువ పథకాలను ప్రవేశపెడతాడోనని టీడీపీ భయపడుతుంది. మరోవైపు వైసీపీ కూడా అంతే. మేనిఫెస్టో కమిటికీ చైర్మన్‌గా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎప్పుడో తమ రిపోర్ట్‌ ని జగన్‌కు ఇచ్చేశారు. కానీ జగనే.. టీడీపీ ప్రకటించిన తర్వాత విడుదల చేద్దామని ఆగారు. ఇలా ఎవరికి వారు.. మేనిఫెస్టోని విడుదల చేయకుండా సేఫ్ గేమ్‌ ఆడుతున్నారు.

ఇప్పుడు సమయం దగ్గరపడింది. ఇప్పుడు కూడా విడుదల చెయ్యకపోతే.. ఎన్నికలకు ఒక్కరోజు ముందు రిలీజ్‌ చేసినా ప్రయోజనం ఉండదు. అదీగాక.. ఏప్రిల్‌ 9 సాయంత్రం 5 తర్వాత ఎన్నికల కమిషన్‌ రూల్స్‌ ప్రకారం మేనిఫెస్టో విడుదల చేయకూడదు. దీంతో.. గురువారమే టీడీపీ తన మేనిఫెస్టోని ప్రకటించాలని అనుకుంది. కానీ వైసీపీ ఉగాది నాడు విడుదల చేస్తుందని తెలుసుకుని… టీడీపీ కూడా శనివారానికి వాయిదా వేసుకుంది. అదీగాక.. శుక్రవారం అమావాస్య. మరీ అమావాస్య ముందు ఎందుకని సెంటిమెంట్‌గా ఫీలైన టీడీపీ శనివారానికి పోస్ట్‌ పోన్‌ చేసుకుంది. మొత్తానికి ఇన్నాళ్లూ ఆగి.. ఇప్పుడు ఇద్దరూ ఒకేరోజు తమ మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఈ ఉగాది.. ఏ పార్టీకి కలిసివస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English