బాబుకు మ‌రో షాక్ త‌ప్ప‌దా?

బాబుకు మ‌రో షాక్ త‌ప్ప‌దా?

ఏపీ అధికార ప‌క్షానికి అనుకూలంగా కొంద‌రు కీల‌క‌ ప్ర‌భుత్వ ఉద్యోగులు.. పోలీస్ శాఖ‌కు చెందిన వారు స‌హ‌క‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు భారీగా వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు ప‌లువురు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసి.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

ఇందులో భాగంగా ఇటీవ‌ల ముగ్గురు పోలీస్ సీనియ‌ర్ అధికారుల‌పై ఈసీ వేటు వేయ‌టం పెను దుమ‌రానికి కార‌ణ‌మైంది. ఈసీ తీరుపై ఏపీ ప్ర‌భుత్వాధినేత‌.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌గా.. తాము చేసిన ఫిర్యాదుల్లో కొన్నింటిపైనే చ‌ర్య‌లు తీసుకోవ‌టం ఏమిటంటూ.. విప‌క్ష నేత‌లు ఈసీని ప్ర‌శ్నించారు.

ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తీరు బాగోలేద‌ని.. ఆయ‌న ఏపీ అధికార‌ప‌క్షానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న‌పై జ‌గ‌న్ పార్టీ నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండ‌గా.. ఏపీ డీజీపీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి పిలుపు వ‌చ్చింది. ఆయన ఈ మ‌ధ్యాహ్నం ఈసీని క‌లువ‌నున్నారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వుల అమలును ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డీజీపీని ఈసీ వివ‌ర‌ణ కోరిన సంగ‌తి తెలిసిందే.

తాజా భేటీలో.. ఇటీవ‌ల తాము జారీ చేసిన ఉత్త‌ర్వుల అమ‌లు విష‌యంలో డీజీపీని వివ‌ర‌ణ కోరే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌దిలీపై ఈసీ నిర్ణ‌యం తీసుకున్నా త‌ర్వాత‌.. అదిప్ప‌టివ‌ర‌కూ అమ‌లు కానివైనంపై వివ‌ర‌ణ కోర‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈసీ నుంచి ఏపీ డీజీపీకి పిలుపు రావ‌టంతో ఆయ‌న ఢిల్లీకి వెళ్లారు. మ‌రి..ఏపీ డీజీపీ విష‌యంలో ఈసీ ఏ రీతిలో రియాక్ట్ కానుంది?  దానికి ఏపీ డీజీపీ ఎలా రియాక్ట్ కానున్నార‌న్నది ఇప్పుడు ఉత్కంట‌గా మారింది. వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్న చంద్ర‌బాబుకు.. ఈసీ నిర్ణ‌యం మ‌రో షాకింగ్ గా మారుతుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English