మామ తరువాత నాన్న తో

మామ తరువాత నాన్న తో

అక్కినేని నాగార్జున కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిన సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. మూడేళ్ల కిందట సంక్రాంతికి పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై ఏకంగా రూ.50 కోట్లకు పైగా షేర్ వసూలుు చేసి నాగ్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందీ చిత్రం. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచిన బంగార్రాజు పాత్రను లీడ్‌‌గా తీసుకుని ‘బంగార్రాజు’ పేరుతో దీనికి ప్రీక్వెల్‌ తీయాలని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే స్క్రిప్టు విషయంలో నాగ్ ఒక పట్టాన సంతృప్తి చెందకపోవడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఆలస్యమైంది. ఐతే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చిందని, త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్తామని నాగ్ ఇటీవలే ఒక ఇంగ్లిష్ డైలీతో చెప్పాడు. కాబట్టి ‘మన్మథుడు-2’ తర్వాత నాగ్ ఈ సినిమా చేయడం ఖాయమనే అనిపిస్తోంది.
ఈ చిత్రంలో నాగ్‌తో పాటు ఆయన పెద్ద కొడుకు నాగచైతన్య కూడా నటిస్తాడని ఇంతకుముందు వార్తలొచ్చాయి.

ఈ విషయం నిజమే అని స్వయంగా నాగచైతన్యనే ధ్రువీకరించాడు. తన కొత్త సినిమా ‘మజిలీ’ ప్రమోషన్లలో భాగంగా అతనీ విషయం వెల్లడించాడు. ‘మనం’ తర్వాత తన తండ్రితో కలిసి మరోసారి నటిస్తున్నానని.. ‘బంగార్రాజు’ సినిమా ఆగస్టులో మొదలవుతుందని చైతూ ప్రకటించాడు. తండ్రితో మళ్లీ జత కట్టడానికి ముందు తన మావయ్య విక్టరీ వెంకటేష్‌తో మళ్లీ కలిసి నటిస్తుండటం పట్ల చైతూ ఎగ్జైట్ అయ్యాడు.

‘వెంకీ మామ’కు సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తయిందని.. ఈ నెల 8 నుంచి కొత్త షెడ్యూల్ మొదలు పెడుతున్నామని.. జులైకల్లా సినిమా పూర్తవుతుందని చైతూ తెలిపాడు. వెంకటేష్ పక్కన నటించడం తనకు ఛాలెంజింగ్‌గా అనిపిస్తోందని.. అదే సమయంలో ఈ అనుభవాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నానని చైతూ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English