వారసులంతా హ్యాండ్ ఇచ్చారుగా బాబుగారు

వారసులంతా హ్యాండ్ ఇచ్చారుగా బాబుగారు

జనసేన పార్టీలో చేరకుండా బయటినుంచి మద్దతు ఇస్తాను అని చెప్పారు మెగాబ్రదర్‌ నాగబాబు. కట్‌ చేస్తే.. పార్టీలో చేరడం, నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిపోయాయి. ప్రస్తుతం నాగబాబు ప్రచారంలో ఫుల్ బిజిగా ఉన్నారు. జబర్దస్త్‌ ఆర్టిస్తులతో పాటు.. నాగబాబు భార్య పద్మజ, కుమార్తె నిహారిక నరాసాపురంలో మకాం వేసి మరీ ప్రచారం చేస్తున్నారు.

టాలీవుడ్‌ హీరోల్లో ఎక్కువుమంది హీరోలు ఉంది మెగాప్యామిలీలోనే. హీరోలు ఉండడం కాదు ఎక్కువ మంది స్టార్‌ స్టేటస్‌ ఉన్న  హీరోలు ఉంది కూడా మెగాఫ్యామిలీలోనే. కానీ వాళ్లెవ్వరూ ఇప్పటివరకు ప్రచారానికి రాలేదు. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తమ తండ్రి మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రచారం చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం అసలు బయటికే రావడం లేదు. అయితే చరణ్ రాకపోవడంలో ఒక రీజన్ ఉంది. చరణ్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ కోసం గుజరాత్‌లో ఉన్నాడు.

ఇక అల్లు అర్జున్‌ కూడా ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశాడు. కానీ ఇప్పుడు అడ్రెస్‌ కూడా లేడు. అలాగనీ పోనీ ఏదైనా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడా అంటే.. బన్నీ కొత్త సినిమా ఇంక మొదలు కానేలేదు. సరే.. అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ అంటే బంధువులు, రాలేదు, కుదరలేదు అనుకోవచ్చు. కానీ కన్నకొడుకు వరుణ్‌తేజ్‌ కూడా తనం తండ్రి ప్రచారానికి రాలేదు. వరుణ్‌ కూడా నాగబాబు ప్రచారానికి దూరంగా ఉన్నాడు. పాపం నాగబాబు. ఇండస్ట్రీలో అందరు ఉన్నా.. ఒక్కడే ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English