తిరుమ‌ల‌కు వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్.. ద‌ర్శ‌నం లేకుండా వెళ్లిపోయారు

తిరుమ‌ల‌కు వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్.. ద‌ర్శ‌నం లేకుండా వెళ్లిపోయారు

తెలుగు ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని ప్ర‌ముఖుల్లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌. యూపీఏ హ‌యాంలో గ‌వ‌ర్న‌ర్ గా అపాయింట్ అయి.. మోడీ హ‌యాంలోనూ స‌క్సెస్ ఫుల్ గా త‌న పోస్టును ఎప్ప‌టిక‌ప్పుడు రెన్యువ‌ల్ చేయించుకుంటున్న ఏకైక గ‌వ‌ర్న‌ర్ గా ఆయ‌న్ను చెప్పాలి.

గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కు తిరుమ‌ల సెంటిమెంట్ ఎంత ఎక్కువో తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ గా ప‌ద‌విని చేప‌ట్టిన కొత్త‌ల్లో అదే ప‌నిగా తిరుమ‌ల‌కు ఆయ‌న వెళ్ల‌టం.. దీనిపై విమ‌ర్శ‌లు ఎక్కువ‌గా రావ‌టంతో ఆయ‌న తిరుమ‌ల టూర్ల‌ను త‌గ్గించుకున్నారు. అయితే.. తిరుమ‌ల‌కు వ‌చ్చిన ప్ర‌తిసారీ.. త‌న ప‌క్క‌న ఎంత పెద్ద నేత ఉన్నా.. తాను న‌మ్మిన సంప్ర‌దాయం ప్ర‌కారం ద‌ర్శ‌నం చేసుకోవ‌టం ఆయ‌న‌కు అల‌వాటు.

తాజాగా తిరుమ‌ల‌కు వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న స‌తీమ‌ణి.. ఇరువురు స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకోకుండానే తిరిగి వెళ్లిపోయిన వైనం ఆస‌క్తిక‌రంగా మారింది. తిరుమ‌ల‌కు వ‌చ్చిన ప్ర‌తిసారీ గ‌వ‌ర్న‌ర్ స్వామి వారిని ద‌ర్శ‌నం చేసుకోవ‌టం మామూలే. ఈసారి అందుకు భిన్నంగా ఆయ‌న టూర్ సాగింది. దీనికి కార‌ణం లేక‌పోలేదు.

గ‌వ‌ర్న‌ర్ స‌మీప బంధువు ఒక‌రు మ‌ర‌ణించార‌న్న వార్త‌ను తెలుసుకున్నంత‌నే గ‌వ‌ర్న‌ర్ త‌న ప‌ర్య‌ట‌న‌ను అర్థంత‌రంగా ముగించుకున్నారు. బంధువులు చ‌నిపోయినప్పుడు దైవ‌ద‌ర్శ‌నం మంచిది కాద‌న్న ఉద్దేశంతోనే ఆయ‌న తిరుమ‌ల‌లో స్వామి వారి ద‌ర్శ‌నం చేసుకోలేద‌ని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English