బోయపాటి పిండేస్తున్నాడుగా..

బోయపాటి పిండేస్తున్నాడుగా..

గతంలో ఎన్నికలు వచ్చినపుడు రాజకీయ పార్టీల యాడ్స్ అంటే అదేదో మొక్కుబడి వ్యవహారం లాగా ఉండేది. వాటిలో ఒక స్టాండర్డ్ కనిపించేది కాదు. అంతగా పేరు లేని యాడ్ ఫిలిం మేకర్స్‌కు వీటి బాధ్యత అప్పగించేవాళ్లు. వాళ్లు నాసిరకంగా యాడ్స్ చేసి పెట్టేవాళ్లు. వీటిలో నిర్మాణ విలువలు కూడా అంతగా ఉండేవి కావు. పొలిటికల్ పార్టీలు కూడా ఈ యాడ్స్‌కు అంతగా ప్రాధాన్యం ఇచ్చేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇది డిజిటల్ యుగం. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న సమయం.

ఈ రోజుల్లో విజువల్ మీడియా ద్వారా జనాల్లోకి వెళ్లడం చాలా కీలకం. అందుకే టీవీ, డిజిటల్ ప్రకటనలపై పొలిటికల్ పార్టీలు గట్టిగానే దృష్టిసారించాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెండు పొలిటికల్ పార్టీలూ ఈ విషయంలో ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. ఐతే తెలుగుదేశం పార్టీదే పైచేయి అనడంలో మరో మాట లేదు.

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెలుగుదేశం పార్టీ కోసం రూపొందించిన ప్రకటనలు జనాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తన సినిమాల్లో ఎప్పుడూ భారీతనం చూపించే బోయపాటి ఎన్నికల ప్రకటనల విషయంలోనూ తగ్గట్లేదు. బాగా ఖర్చు పెట్టించి, మంచి నిర్మాణ విలువలతో ఈ ప్రకటనలు రూపొందించాడు. సినిమాల్లో మాదిరే బోయపాటి మార్కు ఎమోషన్లు.. కొంచెం అతి వీటిలో కనిపిస్తున్నాయి. మరీ అంత ఎమోషన్ ఏంటి.. చంద్రబాబు నాయుడి గురించి జనాలు అంత ఎమోషనల్ అయిపోతారా అని కొందరు సెటైర్లు వేస్తున్నప్పటికీ.. ఆ మాత్రం అవసరం లేకపోలేదు అనేవాళ్లూ ఉన్నారు.

ఒక అనాథ అమ్మాయికి గుడిలో పెళ్లి జరుగుతుంటే.. ఆమె చంద్రబాబును తన అన్నగా చెప్పడం.. లఘ్నపత్రికలో కుటుంబ పెద్దగా ఆయన పేరే రాయించడం.. ఇలా సాగే ఒక ప్రకటన తాజాగా హాట్ టాపిక్ అవుతోంది. ఇది చూసి బోయపాటిని పొగిడేవాళ్లు పొగుడుతున్నారు. సెటైర్లు వేసేవాళ్లు వేస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రకటనలు చర్చనీయాంశం అవుతున్న మాట వాస్తవం. మరోవైపు చంద్రబాబు మీద చాలా ఎమోషనల్‌గా సాగే ఒక పాటను కూడా బోయపాటి రూపొందించాడు. ఆ పాట సినిమాలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో హై స్టాండర్డ్స్‌లో, చాలా ఎఫెక్టివ్‌గా ఉండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English