ఎన్నాళ్ల‌కు ఎన్నాళ్ల‌కు హ‌నుమంత‌న్న మాట్లాడిండు!

ఎన్నాళ్ల‌కు ఎన్నాళ్ల‌కు హ‌నుమంత‌న్న మాట్లాడిండు!

ఎప్పుడు స్టార్ చేశారో.. ఎప్పుడు షూటింగ్ పార్ట్ పూర్తి చేశారో కానీ.. కేసీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా నిర్మించిన ఉద్య‌మ సింహం మూవీ పోస్ట‌ర్లు ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తున్నాయి. సినిమాలో కేసీఆర్ పాత్ర‌ధారి అయితే.. దూరం నుంచి మూవీ పోస్ట‌ర్ చూస్తే.. కేసీఆర్ పోలిక‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నారు. ద‌గ్గ‌ర‌గా చూసిన‌ప్పుడు కాస్త తేడాగా క‌నిపించినా.. దూరం నుంచి మాత్రం కేసీఆర్ ను గుర్తుకు తెచ్చేలా ఉన్నారు.

ఈ మూవీనిఈ రోజు విడుద‌ల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుద‌ల‌ను ఏప్రిల్ 11 వ‌ర‌కు నిలిపివేయాల‌ని కోరుతూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావు  విజ్ఞప్తి చేశారు. ఈసీని క‌లిసిన ఆయ‌న ఉద్య‌మ సింహం మూవీ రిలీజ్ ను ఆపాల‌ని గురువారం కోర‌టం.. దానికి ఈసీ ఎప్పుడు రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

తెలంగాణ‌ను ఇచ్చింది సోనియాగాంధీ అయితే.. కేవ‌లం కేసీఆర్ కార‌ణంగానే తెలంగాణ వ‌చ్చిందంటూ సినిమాలో ప్ర‌చారం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఓప‌క్క విడుద‌ల‌కు అన్ని ప్ర‌య‌త్నాలు జ‌రిగిపోయిన వేళ‌.. ఆల‌స్యంగా మేల్కొన్న వీహెచ్ చేసిన ఫిర్యాదుపై ఈసీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒక‌సారి బొమ్మ బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. దాన్ని ఆప‌టంలో అర్థం లేదు. ఇంత ఆల‌స్యంగా ఫిర్యాదు చేసే బ‌దులు.. ముందే కంప్లైంట్ చేయొచ్చుగా వీహెచ్?

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English