రేలంగి కామెడీని లోకేష్‌ గుర్తుకుతెస్తున్నాడు - నాగబాబు

రేలంగి కామెడీని లోకేష్‌ గుర్తుకుతెస్తున్నాడు - నాగబాబు

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా కామన్‌. ఒకర్ని ఒకరు విమర్శించుకోవడం పరిపాటే. కానీ లోకేష్‌ సీన్‌లోకి ఎంటర్‌ అయ్యాక.. అందరూ అతడినే టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారు. మొన్నటివరకు పప్పు అని కొంతమంది కామెడీ చేస్తే ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి నాగబాబు కూడా చేరారు. నాగబాబు ఇంకో అడుగు ముందుకు వేసి లోకేష్‌పై విమర్శలు చేశారు.

లోకేష్‌ కామెడీ చూస్తుంటే సీనియర్‌ నటుడు రేలంగి గుర్తుకువస్తున్నారని.. లోకేష్‌ అచ్చు ఆయనలాగే కామెడీ చేస్తున్నారని ఆరోపించారు. అసలు లోకేష్‌ దెబ్బకు తాను చేస్తున్న జబర్దస్త్‌ కూడా చాలదని.. దాన్ని మించి కామెడీ చేస్తున్నాడని అన్నారు నాగబాబు.

లోకేష్‌తొ పాటు పనిలోపనిగా చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించారు నాగబాబు. చంద్రబాబుకి మతిస్థిమితం తప్పిందని, దాంతో చిత్రవిచిత్రంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను పోటీకి కొత్త అయినా రాజకీయాలకు కొత్త కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన హవా చూపిస్తుందని చెప్పిన నాగబాబు.. నరసాపురం నుంచి తాను ఎంపీగా గెలవబోతున్నట్లు ప్రకటించారు.

అలాగే వైసీపీ నేత ఈలి నానిపై కూడా కామెంట్లు చేశారు. అసలు ఈలి నానికి నవ్వడమే రాదని అన్నారు. మొత్తానికి ప్రత్యర్ధులపై పవర్‌ఫుల్‌ పంచ్‌లతో పర్‌ఫెక్ట్‌ పొలిటీషియన్‌గా నరసాపురం నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు నాగబాబు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English