ఇలా మాట్లాడితే ఎలా జ‌గ‌న్ బాబు?

ఇలా మాట్లాడితే ఎలా జ‌గ‌న్ బాబు?

ఎన్నిక‌ల వేళ చేసే చిన్న త‌ప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ విష‌యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తెలిసింన‌త బాగా మ‌రెవ‌రికీ తెలీద‌ని చెప్పాలి. రాజ‌కీయంగా ఎప్ప‌టిక‌ప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకోవ‌టంలో జ‌గ‌న్ సిద్ధ‌హ‌స్తుడ‌న్న పేరుంది. దీనికి త‌గ్గ‌ట్లే 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరుతోనే చేతి వ‌ర‌కూ వ‌చ్చిన గెలుపు..నోటి వ‌ర‌కూ రాకుండా పోయిన‌ట్లు విశ్లేషిస్తుంటారు.

ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లో గెలిచి తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న జ‌గ‌న్ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా చెబుతారు.తెర వెనుక త‌న ర‌హ‌స్య స్నేహితుడి పుణ్య‌మా అని.. ఏపీ ఎన్నిక‌ల్లో సానుకూల వాతావ‌ర‌ణాన్నితెచ్చుకున్న జ‌గ‌న్‌, తాజాగా చేస్తున్న త‌ప్పుల‌తో ఆ పార్టీ అభ్య‌ర్థులు వ‌ణికిపోతున్నారు.

తాజాగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడా పార్టీలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. నామినేష‌న్ల దాఖ‌లు వేళ పార్టీకి సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని సంబ‌ర‌ప‌డుతున్న అభ్య‌ర్థుల‌కు జ‌గ‌న్ చేసిన తాజా వ్యాఖ్య‌లు చెమ‌ట‌లు ప‌ట్టించ‌ట‌మే కాదు.. త‌ల ప‌ట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ద్ద‌తు ఇస్తే త‌ప్పేంటి? అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెను దుమారంగా మారాయి.

కేసీఆర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు ఇస్తే త‌ప్పేంటి? అంటూ ప్ర‌శ్నిస‌తంచి తీరు ఒక ఎత్తు అయితే.. ఏపీ ప్ర‌త్యేక హోదాకు టీఆర్ఎస్ వ్య‌తిరేక‌మంటూ తెలంగాణ ఎమ్మెల్యే హ‌రీశ్ రావు చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఓప‌క్క కేసీఆర్ ను త‌న మిత్రుడిగా ఒప్పుకుంటున్న జ‌గ‌న్ మాట‌లు పార్టీకి డ్యామేజ్ చేయ‌టం ఖాయ‌మంటున్నారు.

ఇప్ప‌టికే కేసీఆర్ ఏపీ రాజ‌కీయాల్లోకి జోక్యం చేసుకుంటున్నార‌ని.. వెయ్యి కోట్ల వ‌ర‌కూ అభ్య‌ర్థుల‌కు పంపిన‌ట్లుగా మాట‌లు జోరుగా వినిపిస్తున్న వేళ‌.. కేసీఆర్ త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తే త‌ప్పేంటి? అంటూ సూటిగా ప్ర‌శ్నిస్తున్న జ‌గ‌న్ తీరు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌భావితం చేస్తుందంటున్నారు. తాజాగా పోల‌వ‌రం ప్రాజెక్టుపై తెలంగాణ అధికార‌ప‌క్షం అభ్యంత‌రం పెడుతున్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ లో పోల‌వ‌రం ప్రాజెక్టుపై త‌న అభ్యంత‌రాల్ని డిటైల్డ్ గా వెల్ల‌డించింది. ఇలా ఆంధ్రా ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్ తో జ‌గ‌న్ స్నేహం ఏమిట‌న్న మాట ఏపీ ప్ర‌జ‌ల నోట వినిపిస్తోంది. కీల‌క‌మైన ఎన్నిక‌ల్లో చిన్న త‌ప్పులు జ‌ర‌గ‌కుండా ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాల్సిన అధినేత‌.. వెనుకా ముందు చూసుకోకుండా చేస్తున్న వ్యాఖ్య‌లు జ‌గ‌న్ పార్టీ అభ్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ట్లుగాచెబుతున్నారు. మ‌రీ.. విష‌యంపై జ‌గ‌న్ దృష్టి పెడితే మంచిదంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English