హరీశ్ రచ్చ...లైట్ తీసుకోమంటున్న కేటీఆర్

హరీశ్ రచ్చ...లైట్ తీసుకోమంటున్న కేటీఆర్

టీఆర్ఎస్ పార్టీలో హ‌రీశ్ రావు ఎపిసోడ్ మ‌రోమారు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే కీల‌క ప‌రిణామాలు హ‌రీశ్ కేంద్రంగా చోటుచేసుకున్నాయి. ఊహించ‌ని రీతిలో వ‌చ్చిన వివాదం...పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గ‌డం....అదే రీతిలో స‌ద్దుమ‌ణ‌గడం జ‌రిగిపోయింది. ఇదంతా హ‌రీశ్‌రావుకు స్టార్ క్యాంపెయిన‌ర్ జాబితాలో చోటు ద‌క్క‌క‌పోవ‌డం గురించి.  అయితే, ఈ వివాదం గురించి టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఊహించ‌ని రీతిలో రియాక్ట‌య్యారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం నేప‌థ్యంలో అధికార పార్టీ ఎన్నికల సంఘానికి సమర్పించిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో హరీశ్‌ పేరు లేదు. ఆదివారం ఈసీకి సమర్పించిన లేఖలో 11 మంది మంత్రులతోపాటు మొత్తం 20 మందిని స్టార్‌ క్యాంపెయినర్లుగా గుర్తించాలని టీఆర్‌ఎస్‌ కోరింది. ఇందులో సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులతోపాటు ఎంపీలు కెకె, సంతోశ్‌కుమార్‌, బండ ప్రకాశ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, శేరిసుభాష్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శు లు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పేర్లు ఉన్నాయి. హరీశ్‌ పేరు లేకపోవటంతో దుమారం రేగింది. దీంతో ఆయన అభిమానులు, అనుయాయులు తీవ్ర అసం తృప్తిని వ్యక్తం చేశారు.

గులాబీ పార్టీలో తమ నాయ కుడికి రోజురోజుకీ గౌరవం తగ్గిపోతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి అసంతృప్తిని గమనిం చిందో లేక ఎన్నికలకు ముందు ఆయన గ్రూపుతో వివాదాలెందుకని భావించిందో తెలియదుగానీ టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆఘమేఘాల మీద తన పొర పాటును సవరించుకుంది. హరీశ్‌ పేరును స్టార్‌ క్యాంపెయినర్ల జాబితా లో చేర్చాలని కోరుతూ ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాసింది. దీంతో ఆయన పేరును చేర్చాలంటూ టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఈసీకి లేఖ రాశారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ పేరును తొలగించి హ‌రీశ్ పేరును చేర్చారు.

అయితే, ఈ ఎపిసోడ్‌పై కేటీఆర్ కూల్‌గా రియాక్ట‌య్యారు. రొటీన్‌గా జరిగిన ప్రాసెస్‌లో హరీశ్‌ పేరు కార్యాలయ సిబ్బంది మిస్‌ చేశారు. మంత్రుల పేర్లు, గతంలో ఉన్న కార్యదర్శుల పేర్లు పెట్టారు. అయితే హరీశ్‌ మంత్రిగా లేకపోవడంతో అనుకోకుండా అది మిస్‌ అయింది. పొరపాటు గుర్తించి వెంటనే సరిచేసుకున్నారు. అది అంతపెద్ద విషయం కాదు. దీనికే రకరకాల వ్యాఖ్యానాలు, వార్తలు వ‌చ్చాయ‌న్నారు. ఒక్కోసారి చిన్నచిన్నవి జరుగుతుంటాయని, అంతిమంగా ఎవరైనా పార్టీ అభివృద్ధి కోసం కేసీఆర్‌ నిర్దేశించినట్లు పనిచేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English