భారత బౌలర్‌‌ను ఏకి పడేస్తున్నారు

భారత బౌలర్‌‌ను ఏకి పడేస్తున్నారు

భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అశ్విన్.. సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌ మ్యాచ్‌ సందర్భంగా వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ మ్యాచ్‌లో మొదల పంజాబ్.. 4 వికెట్లకు 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం రాజస్థాన్ సునాయాసంగా మ్యాచ్ గెలిచేలా కనిపించింది.

ఓపెనర్ జోస్ బట్లర్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో పంజాబ్‌కు మ్యాచ్‌ దూరం చేసేలా కనిపించాడు. ఐతే బట్లర్ 69 పరుగులపై ఉండగా అశ్విన్ అతడిని వివాదాస్పద రీతిలో రనౌట్ చేశాడు. 13వ ఓవర్లో అశ్వినత్ బంతి వేయబోతుండగా.. బట్లర్‌ క్రీజు వదిలి కొంచెం ముందుకు కదిలాడు. అశ్విన్ బంతి వేయడం ఆపి అశ్విన్‌ అతడిని రనౌట్‌ చేశాడు. ఇలా చేయడాన్ని మన్కడింగ్‌ అంటారన్న సంగతి తెలిసిందే.

ఇది నిబంధనల ప్రకారమే అయినప్పటికీ.. ఒక్కసారైనా హెచ్చరించకుండానే బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. చాలాసార్లు బౌలర్ ఇలా బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసినప్పటికీ.. తర్వాత అప్పీల్ వెనక్కి తీసుకుంటుంటారు. గతంలో అశ్విన్ భారత జట్టుకు ఆడుతూ ఇలా చేయగా.. అప్పుడు కెప్టెన్‌గా ఉన్న సెహ్వాగ్ అప్పీల్ వెనక్కి తీసుకుని హుందాతనం చాటుకున్నాడు. ఐతే నిన్న పంజాబ్ కెప్టెన్ కూడా అశ్వినే కావడంతో అతను అప్పీల్ వెనక్కి తీసుకోలేదు. మన్కడింగ్ చేయడం కంటే అది చేసిన తీరుతో అశ్విన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

అతను బౌలింగ్ వేయడానికి వచ్చి.. బట్లర్ మూమెంట్‌ను గమనించి ఆగాడు. అతను ముందుకు కదిలాక ఇక్కడ రనౌట్ చేసేశాడు. అశ్విన్ బంతి వేయబోయే సమయంలో బట్లర్ క్రీజులోనే ఉన్నట్లు వీడియోల్ని బట్టి తెలుస్తోంది. దీంతో అతడిని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. భారత అభిమానులు సైతం అశ్విన్‌కు వ్యతిరేకంగా మారారు. విదేశీయుల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. అశ్విన్ మామూలుగానే కొంచెం యాటిట్యూడ్ ఉన్న వాడు కావడం.. ఈ ఘటనపై తర్వాత కూడా విచారం వ్యక్తం చేయకపోవడంతో మరింతగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English