హైకోర్టులో హాట్ హాట్ గా డేటా కేసు వాద‌న‌లు..

హైకోర్టులో హాట్ హాట్ గా డేటా కేసు వాద‌న‌లు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిన డేటా చోరీ కేసుకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ చోటు చేసుకున్న అంశాలు రాజ‌కీయంగా ఎంత హాట్ హాట్ గా మారాయో తెలిసిందే. తాజాగా ఈ కేసు విచార‌ణ హైకోర్టులో మొద‌లైంది. ఈ కేసు విచార‌ణ‌లో వాది.. ప్ర‌తివాదుల మ‌ధ్య వాద‌న‌లు హోరాహోరీగా సాగాయి. రెండు వ‌ర్గాల త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించేందుకు ప్ర‌ఖ్యాత సుప్రీంకోర్టు లాయ‌ర్లు రావ‌టం ఒక విశేష‌మైతే.. ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌తివాదిగా ఎన్నిక‌ల సంఘాన్ని చేర్చేందుకు హైకోర్టు అనుమ‌తిచ్చింది.

అస‌లు ఓట‌ర్ల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారం చోరీకి గురైందా?  లేదా? అన్న విష‌యాన్ని తేల్చేదెవ‌రు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఎన్నిక‌ల సంఘం అని చెప్పిన పిటిష‌న‌ర్ ఐటీ గ్రిడ్స్ సంస్థ డైరెక్ట‌ర్ అశోక్ కు ఆయ‌న కోరిన‌ట్లే ఈ కేసులో ఎన్నిక‌ల సంఘాన్ని చేర్చారు.

తెలంగాణ‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌కు సంబంధించిన డేటా చోరీకి గురైంద‌న్న ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు రియాక్ట్ కావ‌టం.. త‌నిఖీలు నిర్వ‌హించ‌టం లాంటివి చేశారు. ఎన్నిక‌ల వేళ వెలుగు చూసిన వైనం రాజ‌కీయంగా హాట్ హాట్ గా మారింది. త‌మ సంస్థ‌పై కావాల‌నే కేసు పెట్టార‌ని.. రాజ‌కీయ దురుద్దేశంతోనే కేసుల్ని న‌మోదు చేసిన‌ట్లుగా అశోక్ పేర్కొన్నారు. అస‌లు కేసు పెట్టే ప‌రిధి తెలంగాణ పోలీసుల‌కు లేద‌న్న ఆయ‌న‌.. ఫిర్యాదు ఇచ్చిన స‌మ‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిందిగా ఆయ‌న కోరారు. త‌మ‌పై పోలీస్ స్టేష‌న్ల‌లో పెట్టిన కేసుల్ని కొట్టివేయాల్సిందిగా కోర్టును కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

త‌మ వాద‌న‌లు వినిపించిన ఐటీ గిడ్స్ త‌ర‌ఫు న్యాయ‌వాది.. మార్చి 2న అర్థ‌రాత్రి ఫిర్యాదు ఇచ్చార‌ని.. ఆ వెంట‌నే పోలీసులు త‌మ కార్యాల‌యంలోకి వ‌చ్చి బ‌ల‌వంతంగా డేటాను డౌన్ లోడ్ చేసుకొని వెళ్లార‌న్నారు. ఇది ఉన్న‌త‌స్థాయిలో జ‌రిగిన రాజ‌కీయ కుట్ర‌గా అభివ‌ర్ణించారు. టీఆర్ఎస్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు క‌లిసి త‌మ‌ను ఇరికించాల‌ని ప్ర‌య‌త్నంచేసిన‌ట్లుగా అశోక్ త‌ర‌ఫు లాయ‌ర్ పేర్కొన్నారు.

ఈ కేసుకు సంబంధించి ఐటీ గ్రిడ్స్ త‌ర‌ఫున ప్ర‌ముఖ సుప్రీంకోర్టు న్యాయ‌వాది సిద్దార్థ్ లూథ్రా త‌న వాద‌న‌లు వినిపించ‌గా.. తెలంగాణ త‌ర‌ఫున సుప్రీంకోర్టు న్యాయ‌వాది మ‌హేష్ జెఠ్మ‌లానీ వాద‌న‌లు వినిపించారు.

తెలంగాణ త‌ర‌పు లాయ‌ర్ వాద‌న ఏమంటే..

+ సీఆర్‌పీసీ సెక్షన్‌ 126 ప్రకారం స్థానికంగా జరిగిన వ్యవహారంపై కేసు నమోదు చేసే పరిధి ఉంది.

+ సంఘటన జరిగింది తెలంగాణలో, కంపెనీ, నిందితుడు నివాసమున్నదీ హైదరాబాద్‌లోనేనని అలాంటప్పుడు కేసును ఇక్కడే నమోదు చేసే పరిధి ఉంది

+ దర్యాప్తు ప్రాథమిక దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదు.

+ ఐటీ గ్రిడ్స్‌కు చెందిన అశోక్‌ హైదరాబాద్‌లో క్రిమినల్‌ చర్యలకు పాల్పడ్డారు. దర్యాప్తునకు రావడంలేదు. కావాలనే జాప్యం చేస్తున్నారు.

+ ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన సమాచారం హార్డ్‌ డిస్క్‌లో ఉంది. కలర్‌ ఫొటోలతో కూడిన జాబితా ఈసీ వద్దనే ఉంటుంది. ఇది అశోక్‌ కంపెనీలో లభించింది.

+ రంగారెడ్డి, హైదరాబాద్‌, కడప, విశాఖలకు చెందిన వారి సమాచారం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన 7 కోట్ల మందికి చెందిన వ్యక్తిగత సమాచారం వారి దగ్గర ఉంది.

+ 7 కోట్ల మంది ఓటర్లలో 1.7 కోట్లకు పైగా తొలగించారు. అందుకే తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగి చర్యలు ప్రారంభించారు.

+ ఐటీ గ్రిడ్స్‌ సంస్థ చర్య నేరపూరితమే కాదు.. తీవ్రమైనది. ఈ డేటా చోరీకి సంబంధించి అదే సంస్థకు చెందిన ఉద్యోగి ఫిర్యాదు చేశారు. దాన్ని సంస్థ డైరెక్టర్‌ కూడా వివాదస్పదం చేయడం లేదు.

+ కేసు విచారణ పరిధి లేదనే కారణంతో ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలిచ్చింది.  


ఐటీ గిబ్స్ త‌ర‌ఫులాయ‌ర్ వాద‌న ఇది

+ ఇది రాజకీయ, దురుద్దేశాలతో పెట్టిన కేసు. అసలు కేసు పెట్టే పరిధి తెలంగాణ పోలీసులకు లేదు.

+  ఫిర్యాదు ఇచ్చిన సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మార్చి 2న అర్ధరాత్రి ఫిర్యాదు ఇచ్చారు.  వెంటనే పోలీసులు తమ కార్యాలయంలోకి వచ్చి బలవంతంగా డేటాను డౌన్‌లోడ్‌ చేసుకెళ్లారు.

+ ఇది ఉన్నత స్థాయిలో జరిగిన రాజకీయ కుట్ర. టీఆర్ఎస్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలుక‌లిసి ఇరికించాయి.

+ మేం కేవలం సర్వీసు ప్రొవైడర్లం మాత్ర‌మే. , ఓట్లను తొలగించడం మాకు సాధ్యం కాదు.

+ ఏపీ ఓటర్లకు సంబంధించిన అంశమైనందున దీన్ని అక్కడికి బదిలీ చేయాలి.

+ తెలంగాణ ఓటర్లు ఉన్నారని ప్రతివాదులు చెబుతున్నప్పటికీ రెండు ఎఫ్ఆర్‌లలో ఆ ప్రస్తావన లేదు.

+ టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌, వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌ల్లో సమాచారం అప్‌లోడ్‌ చేశారని, వ్యక్తులకు సంబంధించిన ప్రైవేటు వివరాలు అశోక్‌ వద్దకు ఎలా వెళ్లాయి?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English