బిజినెస్ కోసం వెళ్లిన మ‌నోడ్ని ఇథియోపియాలో చంపేశారు!

బిజినెస్ కోసం వెళ్లిన మ‌నోడ్ని ఇథియోపియాలో చంపేశారు!

దేశం కాని దేశానికి ఉద్యోగం కోసం వెళ్లేవారెంద‌రో. అదే రీతిలో బిజినెస్ కోసం.. వ్య‌వ‌సాయం చేయ‌టం కోసం విదేశాల‌కు వెళ్లే వారిలో మ‌నోళ్ల సంఖ్య ఎక్కువ‌గానే ఉంటుంది. తాజాగా ఇదే తీరులో ఇథియోపియా దేశంలో రాగి గ‌నుల బిజినెస్ చేసేందుకు వెళ్లిన హైద‌రాబాదీ ఒక‌రు అనూహ్యంగా చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లో చ‌నిపోయారు. రాగి గ‌నుల వ్యాపారం కోసం వెళ్లిన ఆయ‌న కారును ఆగంతుకులు నిప్పు పెట్టిన ఉదంతంలో ఆయ‌న‌తో పాటు మ‌రో న‌లుగురు కూడా స‌జీవ ద‌హ‌న‌మైన‌ట్లు తెలుస్తోంది.

హైద‌రాబాద్ లోని అశోక్ న‌గ‌ర్ కు చెందిన శ‌శిధ‌ర్ బిజినెస్ చేస్తుంటారు. బాలాన‌గ‌ర్ స‌మీపంలోని పంట‌ల ఉత్ప‌త్తులు.. ఇత‌ర వ‌స్తువులు నిల్వ చేసే శీత‌ల గిడ్డంగి వ్యాపారంతో పాటు.. అండ‌మాన్ నికోబార్ దీవుల్లో సీఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ ను చేస్తుంటారు. పాతికేళ్లుగా ఆయ‌నీ వ్యాపారం చేస్తున్న‌ట్లు చెబుతారు.

తాజాగా ఇథియోపియాలో రాగి గ‌నుల వ్యాపారం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్క‌డి ప్ర‌భుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. అక్క‌డి ప్ర‌భుత్వంతో చేసుకోవాల్సిన అన్ని ప‌నులు దాదాపుగా పూర్తి అయ్యాయ‌ని.. గ‌నుల్ని చూసేందుకు రెండు బృందాలు వెళ్లాయి. రెండు కార్ల‌లో గ‌నుల్ని చూసేందుకు వెళుతున్న వారి వాహ‌నాల్లో ఒక దానిపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు కారుకు నిప్పు అంటించి కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురిని చంపేశారు. అలా మ‌ర‌ణించిన వారిలో శ‌శిధ‌ర్ ఒక‌రు. ఈ ఉదంతం వెనుక అస‌లు కార‌ణం ఏమిట‌న్న‌ది బ‌య‌ట‌కు రాలేదు.

ఇదిలా ఉంటే శ‌శిధ‌ర్ స‌తీమ‌ణికి గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్నాయి. దీంతో.. భ‌ర్త‌మ‌ర‌ణించిన విష‌యాన్ని ఆమెకు తెలియ‌నివ్వ‌లేదు. అదే స‌మ‌యంలో శ‌శిధ‌ర్ భౌతిక‌కాయాన్ని భార‌త్ కు ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English