ఇంకో సీనియ‌ర్‌కు గాలం...ఫ‌లించ‌ని బీజేపీ స్కెచ్

ఇంకో సీనియ‌ర్‌కు గాలం...ఫ‌లించ‌ని బీజేపీ స్కెచ్

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా స్కెచ్ తెలంగాణ‌లో మ‌ళ్లీ పూర్తిగా స‌క్సెస్ కాలేదు. భారీ టార్గెట్  పెట్టుకున్న‌ప్ప‌టికీ అది స‌ఫ‌లం కాలేదు. ఎంపీ సీట్లు ఎర‌గా వేసి ప్ర‌ముఖుల‌కు కాషాయ కండువా క‌ప్పాల‌ని భావించిన ఆయ‌న ఎత్తుగ‌డ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. కేవ‌లం ఒక్క నేత మాత్ర‌మే కండువా మార్చుకున్నారు. మ‌రో సీనియ‌ర్ నేత‌...తాను బీజేపీలో చేరడం లేదంటూ కుండ‌బ‌ద్దలు కొట్టిన‌ట్లు తెలిపారు. అలా కండువా మార్చుకుంది సీనియ‌ర్ నేత డీకే అరుణ కాగా...పార్టీలో చేర‌డం లేద‌ని ప్ర‌క‌టించింది మాజీ మంత్రి సునీతా ల‌క్ష్మారెడ్డి.

పార్ల‌మెంటు ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు, టీఆర్ఎస్ అసంతృప్తి నేతలపై బీజేపీ ఫోక‌స్ పెట్టింది. దీనికోసం బీజేపీ కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగింది. అసంతృప్తులు, టిక్కెట్ దక్కని సిట్టింగ్ ఎంపీలపై కన్నేసింది. వారితో చర్చల మీద చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా సీనియ‌ర్ నేతలు డీకే అరుణ, సోయం బాబూరావు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ ప్రచారం చేసింది.  దాదాపు 20 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు లీకులు ఇచ్చింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు సునీత లక్ష్మారెడ్డితో బీజేపీ సంప్రదింపులు జరుపుతున్నట్లు అప్ర‌క‌టిత స‌మాచారం అందించింది. పార్టీలో చేరాలని కోరిన బీజేపీ నాయకులు కోరగా, ఆలోచించి నిర్ణయం చెబుతానని సునీతా లక్ష్మారెడ్డి చెప్పారని, ఆమెకు మెదక్ ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే, ఈ ప్ర‌చారాన్ని మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి కొట్టిపారేశారు. బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన సునీత లక్ష్మారెడ్డి తనపై అబద్ధపు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, తనపై వస్తున్న వార్తలన్నీ అబద్దాలన్నారు. కుట్రపూరితంగా ఇదంతా జరుగుతుందని, త‌న అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని నమ్మవద్దని సునీత లక్ష్మారెడ్డి కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English