హెచ్‌1బీ పిటిష‌న్ల తేదీ విడుద‌ల‌...

హెచ్‌1బీ పిటిష‌న్ల తేదీ విడుద‌ల‌...

గ‌త కొద్దికాలంగా నిరీక్ష‌ణ‌లో ఉన్న టెకీల ఉత్కంఠ‌కు తెర‌దించుతూ,  హెచ్-1బీ వీసా పిటిషన్లను ఏప్రిల్ 1 నుంచి స్వీకరించనున్నట్టు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవలు (యుఎస్సీఐఎస్) ప్రకటించింది. భారత టెక్నాలజీ సంస్థలు విస్తృతంగా ఉపయోగించే ఈ వీసాలు మే 20 నుంచి ప్రీమియం ప్రాసెసింగ్ ఆరంభం కానున్నట్టు తెలిసింది.  ఈ ప్రక్రియలో పారదర్శకత పెంచడానికి యుఎస్సీఐఎస్ కొత్తగా 'ఎంప్లాయర్ డేటా హబ్' (యజమాని డేటా కేంద్రం) ప్రవేశపెడుతోంది. ఈ ఎంప్లాయర్ డేటా హబ్ లో ప్రతి ఆర్థిక సంవత్సరంలో వచ్చిన హెచ్-1బీ అభ్యర్థుల వివరాలు పొందుపరుస్తారు. పరిశ్రమ కోడ్, సంస్థ పేరు, నగరం, రాష్ట్రం, జిప్ కోడ్ వంటి వివరాలన్నీ బహిరంగంగా అందుబాటులో ఉంటాయి.

 యుఎస్సీఐఎస్ డైరెక్టర్ లీ ఫ్రాన్సిస్ సిస్నా తాజా ప్ర‌క్రియ గురించి వివ‌రిస్తూ,  `మా కొత్త హెచ్-1బీ డేటా హబ్ తో ప్రజలకు సమాచారం మరింత అందుబాటులోకి రానుంది. కొత్త ఎంపిక ప్రక్రియ వ్యవస్థను మరింత మెరుగైన, అమెరికా కార్మికుల వేతనాలను రక్షించేందుకు తోడ్పడుతుంది. అదనంగా ప్రీమియం ప్రాసెసింగ్ కి మా రెండు దశలవారీ విధానం ప్రక్రియ యజమానులకు, యుఎస్సీఐఎస్ కి మరింత ప్రభావవంతంగా, సమర్థవంతంగా సాయపడుతుందని` అని వెల్ల‌డించారు.

ఇదిలాఉండ‌గా, ప్రీమియం ప్రాసెసింగ్ రెండు దశల్లో అందించబడుతుంది. తొలి దశలో ఆర్థిక సంవత్సరం 2020 క్యాప్-స్థితి మార్పును అభ్యర్థిస్తూ వచ్చే హెచ్-1బీ పిటిషన్లు; రెండో దశలో ఆర్థిక సంవత్సరం 2020కి మిగతా అన్ని క్యాప్-పిటిషన్లు ఉంటాయి. తాజాగా ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ మొద‌లైన నేప‌థ్యంలో నిబంధ‌న‌ల అనుస‌రించి మ‌న టెకీలు హెచ్‌1బీ వీసాల‌కు పెద్ద ఎత్తున్నే ద‌ర‌ఖాస్తులు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English