డీకే ఆరుణ బీజేపీలో చేరడం తెలివైన పనేనా.?

డీకే ఆరుణ బీజేపీలో చేరడం తెలివైన పనేనా.?

మొత్తానికి కాంగ్రెస్‌ అనే మహావృక్షం నుంచి ఒక్కో ఆకు రాలిపోతున్నట్లుగా.. ఒక్కొక్క సీనియర్‌ నేత వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్‌ మహబూబ్‌ జిల్లాలో తిరుగులేని స్థానంలో ఉన్న డీకే అరుణ కాంగ్రెస్‌ పార్టీ వదిలి బీజేపీని చేరడంలో అంతా షాక్ అయ్యారు. అసలు అరుణ కాంగ్రెస్‌ని వీడి బీజేపీలోకి వెళ్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ లో భాగంగా టీఆర్‌ఎస్‌లోకి వెళ్తుందని అనుకున్నారు తప్ప బీజేపీలో జాయిన్‌ అవుతుందని అనుకోలేదు. అయితే.. ఇక్కడే ఆమె చాలా తెలివిగా వ్యవహరించారు.

1. సపోజ్‌.. ఫర్‌ సపోజ్‌.. కాంగ్రెస్‌లోనే ఉంటే డీకే ఆరుణకు ఏమొస్తుంది. మహా అయితే టీపీసీసీ పదవి వస్తుంది. దాని వల్ల పైసా ఉపయోగం ఉండదు.కేవలం అది రబ్బర్‌ స్టాంప్ పోస్ట్‌ అని ఆమెకు తెలుసు. నిర్ణయాలు అన్నీ ఢిల్లీ నుంచి వస్తున్నప్పుడు.. టీపీసీసీ మాటని ఎవ్వరూ పట్టించుకోరు. అదీగాక.. గత ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నారు. రెండోసారి కూడా టీఆర్‌ఎస్ రావడంతో మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాలి.

2. అందరూ ఊహించినట్లుగా టీఆర్‌ఎస్‌లో చేరితే వెంటనే పదవి రాకపోవచ్చు.  ఆల్‌రెడీ సబితా ఇంద్రారెడ్డి పార్టీలో చేరారు కాబట్టి.. ఇప్పట్లో డీకే ఆరుణకు ఎలాంది పదవి వచ్చే అవకాశమే లేదు. ఇక పార్టీలో ర్యాంక్‌ పరంగా చూస్తే.. టాప్‌ 10లో డీకే అరుణ ఉండదు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, సంతోష్‌, బాల్కసుమన్‌, హరీష్‌రావు ఇలా చెప్పుకుంటూ పోతే.. డీకే అరుణ ఎక్కడో ఉంటుంది.

3. బీజేపీలో చేరడంతో ఇప్పుడు మహబూబ్‌ నగర్‌ స్థానం నుంచి ఎంపీ గా పోటీ చేస్తుంది. గెలిస్తే డీకే అరుణకు తిరుగు ఉండదు. ఒక వేళఓడినా.. వచ్చేది మళ్లీ మోదీ ప్రభుత్వమే కాబట్టి.. ఏదో ఒక రాష్ట్రం నుంచి  రాజ్యసభ ఎంపీగా వెళ్లొచ్చు. అదృష్టం బావుంటే కేబినెట్‌ మంత్రిగా కూడా అవ్వొచ్చు. అన్నింటికి మించి సౌత్‌లో బలపడాలి అనుకుంటున్న బీజేపీకి డీకే అరుణ మంచి ఆప్షన్‌. బీజేపీ పెద్దలకు ఆశలకు అనుగుణంగా రాష్ట్రంలో కొద్దిగా కష్టపడి 20 నుంచి 30 సీట్లు తీసుకురాగలిగితే.. డీకే ఆరుణకు బీజేపీ రెడ్‌ కార్పెట్‌ వేస్తుంది.

4. మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి గెలిస్తే ఫర్వాలేదు. గెలవకపోయినా, రాజ్యసభ ఎంపీ ఇవ్వకపోయినా డీకే అరుణకు పోయేది ఏమీ లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చాలా కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకోవచ్చు. అదీగాక… కేంద్రం అధీనంలో చాలా రాజ్యంగబద్ధమైన పదవులు ఉంటాయి. వాటిల్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు.సో.. ఎలా చూసినా బీజేపీకి వెళ్లడం డీకే అరుణ  తీసుకున్న తెలివైన నిర్ణయంగా చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English