జ‌గ‌న్ గెలిచే సీట్ల‌పై త‌ల‌సాని సంచ‌ల‌న జోస్యం

జ‌గ‌న్ గెలిచే సీట్ల‌పై త‌ల‌సాని సంచ‌ల‌న జోస్యం

ఇటీవ‌లి కాలంలో ఏపీ రాజ‌కీయాల‌పై మునుపెన్న‌డూ లేని ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నాయ‌కుడు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మరోమారు ఆ రాష్ట్రంలోని ప‌రిణామాల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హోరాహోరీగా సాగుతున్న ఏపీ పోరు విజేత‌లు ఎవ‌రో తేల్చేశారు. అంతేకాకుండా అధికారంలోకి వ‌చ్చే పార్టీకి ద‌క్కే సీట్ల గురించి కూడా త‌ల‌సాని చెప్పేశారు. ఇంత‌కీ త‌ల‌సాని జోస్యం ప్ర‌కారం అధికారంలోకి వ‌చ్చేదెవ‌రంటే...వైసీపీయే.

హైద‌రాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీలో త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ తాజాగా విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ, వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్‌కు 120-130 సీట్లు వ‌స్తాయ‌ని త‌ల‌సాని వెల్ల‌డించారు. ``ఏపీ ప్రజలు మోసగాడైన చంద్రబాబును ఇంటికి పంపాలని ఎపుడో నిర్ణయించుకున్నారు. వైసీపీ 120 నుంచి 130 సీట్లు గెలవబోతోంది ..రాసి పెట్టుకోండి. 22 -23 ఎంపీ సీట్లు వైసీపీకి వ‌స్తాయి. ఓడిపోయాక చంద్రబాబు చేరుకునేది హైదరాబాద్ ఇంటికే`` అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్ర‌బాబుపై త‌ల‌సాని తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. `చేసింది చెప్పుకోలేక చంద్రబాబు చిల్లరగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబువి అన్నీ దొంగ మాటలే. హైదరాబాద్‌లో టీడీపీ నేతలకు ఆస్తులుంటే టీఆర్ఎస్‌ వారిని బెదిరిసున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు. సెంటిమెంటును రెచ్చగొట్టేందుకు బాబు అలా మాట్లాడుతున్నారు. సెంటిమెంటు రెచ్చగొట్టే తెలివి కూడా బాబుకు లేదు. జగన్‌కు బాబు మాటలే ఫ్రీ పబ్లిసిటీ!``అని వ్యాఖ్యానించారు.

అందరీ చరిత్రలు బయట పెడతాన‌ని చంద్ర‌బాబు అంటున్నారని అయితే, బాబు చరిత్ర త‌న దగ్గర ఉందని త‌ల‌సాని చెప్పుకొచ్చారు. ఓటుకు నోటు కేసులో దొరికి అమరావతికి పారిపోయిన దొంగ చంద్రబాబు అని త‌ల‌సాని ఆరోపించారు. ``బాబు ప్రసంగాలతో జనాలకు బోర్ కొడుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం మాట దేవుడెరుగు...విజయవాడలో కనక దుర్గ ఫ్లై ఓవర్ బ్రిడ్జి కట్టలేకపోయారు. పసువు-కుంకుమ పేరిట ఇస్తున్న డబ్బులను ఎన్నికల తర్వాత బాబు ఇవ్వరు. ఇది దగా మోసం. కేసీఆర్‌ను ప్రతి క్షణం తలుచుకోవడమే చంద్రబాబు బతుకు. రాబోయే ఎన్నిక‌ల్లో బాబు ఓట‌మి ఖాయం`` అని జోస్యం చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English