విశాఖ ఎంపీగా జేడీ.. గెలుపు సాధ్యమేనా.?

విశాఖ ఎంపీగా జేడీ.. గెలుపు సాధ్యమేనా.?

రాష్ట్ర రాజకీయాలు రోజుకో రకంగా మారిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు పార్టీలో చేరతారో, ఎవరికి ఎప్పుడు సీటు వస్తుందో చెప్పలేని పరిస్థితి. అయితే ఒక్కటి మాత్రం నిజం. లాస్ట్‌ మినిట్‌లో పార్టీలో చేరినవారికే అన్ని పార్టీలు సీట్లు ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో చేరారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ. మొన్నటివరకు సొంత పార్టీ పెడతానని కొన్నాళ్లు, లేదు లోక్‌సత్తాలో చేరతానని ఇంకొన్నాళ్లు, కాదు కాదు టీడీపీ అని మరికొన్నాళ్లు.. ఇలా అన్ని లీకులు ఇచ్చేసి.. ఫైనల్‌గా జనసేన పార్టీలో చేరిపోయాడు లక్ష్మీనారాయణ. చేరడమే కాదు.. విశాఖ ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారు. మరి విశాఖ ఎంపీగా ఆయన గెలుపు ఎంతవరకు సాధ్యం అనేది ఒక్కసారి చూద్దాం.

విశాఖలో ఫలానా వాళ్లు ఎక్కువ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే.. ఈ నగరం బాగా అబివృద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ వివిద రకాల రాష్ట్రాలకు చెందిన వారు నివశిస్తున్నారు. నేవీ వల్ల కానీ, స్టీల్‌ ప్లాంట్‌ వల్లకానీ బాగా అర్బన్‌ ఓటింగ్ ఎక్కువ.  అయితే ఎంత అర్బన్ ఓటింగ్‌ ఉందో అంతే రూరల్‌ ఓటింగ్‌ కూడా ఉంది. ఇక విశాఖలో ఉన్న ఓటింగ్‌ ఫ్యాక్టర్స్‌ని ఒక్కసారి గమనిస్తే.. ఈ ప్రాంతలో కాపు కమ్యూనిటీ ఎక్కువ. లక్ష్మీ నారాయణ కూడా కాపు కావడం, అందులోనూ జనసేన లాంటి పార్టీ నుంచి పోటీ చేయడం ఆయనకు బాగా కలిసివచ్చే అంశం. అన్నింటికి మించి విశాఖలో జనసేనకు మంచి పట్టుంది. ఇక్కడ అన్ని కులాల్లోనూ జనసేన కార్యకర్తలున్నారు. వాళ్లంతా ఇప్పుడు ఔట్‌రైట్‌గా లక్ష్మీనారాయణకే మద్దుతు ఇస్తారు. ఇక జేడీగా, ఐపీఎస్‌ అధికారిగా లక్ష్మీనారాయణ చాలామంది యూత్‌కి ఇన్‌స్పిరేషన్‌. సో వాళ్ల ఓట్లు కూడా ఆయనకే. ఇక స్టీల్‌ ప్లాంట్‌, నేవీలో పనిచేసే ఉత్తారాది వాళ్లు తమ ఓటు వినియోగించుకునే ముందు వాళ్లు చూసే ఫ్యాక్టర్ ఒక్కటే. అభ్యర్థి చదువుకున్నవాడా కాదా అని. లక్ష్మీనారాయణ ఐపీఎస్‌ ఆపీసర్‌ కావడంతో వారి ఓట్లు కూడా ఆయనకే. ఇక కాపు సామాజిక వర్గ బలం ఎటూ ఉండనే ఉంది.

ఇక టీడీపీ అభ్యర్థి విషయానికి వస్తే.. ఎంవీఎస్‌ఎస్‌ మూర్తి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాడు శ్రీభరత్‌. తాత వారసత్వం, ఆయన చనిపోయిన సానుభూతి కొంచెం వర్కవుట్‌ కావొచ్చు. ఇక కమ్మఓట్లు, టీడీపీ అభిమానలు ఓట్లు  శ్రీభరత్‌కు అండగా ఉంటాయి. అదే టైమ్‌లో వైసీపీ నుంచి ఎంవీవీ సత్యానారాయణ పోటీలో ఉన్నారు. ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. సో.. ఇక్కడ శ్రీభరత్‌, సత్యనారాయణ తమ వర్గ ఓట్లని పంచుకోవాలి. అంటే.. ఓట్లు చీలిపోయేది ఇక్కేడ. ఇక్కడ ఓట్లు చీలిపోవడం వల్ల అంతిమంగా అది లక్ష్మీనారాయణకు కలిసొస్తుంది. సో.. ఎలా చూసినా, అద్భుతాలు జరిగితే తప్ప విశాఖ ఎంపీగా లక్ష్మీనారాయణ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English