జ‌న‌సేన జాబితా..జేడీ బ‌రిలో దిగేది ఇక్క‌డే

జ‌న‌సేన జాబితా..జేడీ బ‌రిలో దిగేది ఇక్క‌డే

జ‌న‌సేన పార్టీ మ‌రో జాబితా విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే శాసనసభ, పార్లమెంట్ స్థానాలకు  జనసేన పార్టీ తరపున పోటీ చేయనున్న మూడు జాబితాల‌ను విడుద‌ల చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ మరికొంత మంది అభ్యర్థుల జాబితాను తాజాగా విడుద‌ల చేసింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం ఈ మేర‌కు అభ్య‌ర్థుల‌కు ఓకే చెప్పేశారు. ఇందులో  సి.బి.ఐ. మాజీ జె.డి వి.వి.లక్ష్మీనారాయణకు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా అవ‌కాశం క‌ల్పించారు. ఆయ‌న తోడ‌ల్లుడు మాజీ వైస్ చాన్స్‌ల‌ర్‌ రాజగోపాల్‌కు పార్టీలో కీల‌క ప‌ద‌వి క‌ల్పించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

జె.డి.లక్ష్మీనారాయణతో పాటుగా ఆయ‌న‌ తోడల్లుడు రాజగోపాల్ జనసేన పార్టీలో ఇటీవ‌ల చేరిన సంగ‌తి తెలిసిందే.
తాజా ఎన్నిక‌ల బ‌రిలో రాజ‌గోపాల్‌ను అనంతపురం నుంచి శాసనసభ స్థానం నుంచి పోటీచేయించాలని జ‌న‌సేనలో స‌న్నాహాలు జ‌రిగాయి. అయితే, ఇక్క‌డ పార్టీ నేత‌,  టీసీ వరుణ్‌కు టికెట్ కేటాయించాల్సి వ‌చ్చింది. దీంతో రాజ‌గోపాల్‌ పార్టీ భాద్యతలు నిర్వర్తించండానికి మొగ్గు చూపారు.పార్టీకి సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఆయ‌న‌కు ఓ క‌మిటీలో చోటు క‌ల్పించినున్న‌ట్లు జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌టించింది.

జనసేన తాజా జాబితా వివరాలు ఇవి

లోక్‌సభ అభ్యర్థి
విశాఖపట్నం     : వి.వి.లక్ష్మీనారాయణ

శాసనసభ అభ్యర్థులు
విశాఖపట్నం ఉత్తరం     : పసుపులేటి ఉషా కిరణ్
విశాఖపట్నం దక్షిణం     : గంపల గిరిధర్
విశాఖపట్నం తూర్పు      :  కోన తాతా రావు
భీమిలి                         : పంచకర్ల సందీప్
అమలాపురం               :  శెట్టిబత్తుల రాజబాబు
పెద్దాపురం                   : తుమ్మల రామ స్వామి ( బాబు )
పోలవరం                     :  చిర్రి బాల రాజు  
అనంతపురం                :  టి.సి.వరుణ్

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English