రేవంత్ విష‌యంలో కేసీఆర్ ఇంత సీరియ‌స్‌గా ఉన్నాడే

రేవంత్ విష‌యంలో కేసీఆర్ ఇంత సీరియ‌స్‌గా ఉన్నాడే

తెలంగాణ‌లో ఇప్పుడు మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల కంటే హాట్‌, అంద‌రి దృష్టి ప‌డిన పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ఏదైనా ఉందంటే...అది మ‌ల్కాజ్‌గిరి. దేశంలోనే అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గ‌మైన మ‌ల్కాజ్‌గిరీలో ప్ర‌స్తుతం పోటీ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నికల్లో త‌న సొంత ఇలాకా అయిన కొడంగ‌ల్‌లో రేవంత్ ఓడిపోయిన‌ప్ప‌టికీ, ఆయ‌న‌కు కాంగ్రెస్ అధిష్టానం మ‌ల్కాజ్‌గిరి అవ‌కాశం ఇచ్చింది. ఇప్ప‌టికే త‌న గెలుపు కోసం కావాల్సిన ఎత్తుగ‌డ‌ల్లో రేవంత్ బిజీ అయిపోయారు.

ఇలా రేవంత్ త‌న‌దైన శైలిలో దూకుడుగా ముందుకు సాగుతున్న త‌రుణంలో, అల‌ర్ట్ అయింది ఎవ‌రంటే...తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఔను. త‌న‌కు పంటికింద రాయిలా మారిన కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని మ‌రోమారు ఓడించాల‌నే ల‌క్ష్యంతో కేసీఆర్ పావులు క‌దుపుతున్నారు. ఇందులో భాగంగానే, మల్కాజిగిరి లోక్‌సభ బరిలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున రేవంత్‌ను పోటీకి దిగడంతో బలమైన అభ్యర్థిని నిలపాలన్న నిర్ణయానికి తెరాస అధినేత కేసీఆర్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ సమీప బంధువు నవీన్‌రావు పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆయనతో పాటు కార్మీకశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సమీప బంధువు రాజశేఖరరెడ్డి, మరో పారిశ్రామికవేత్త రంజిత్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారి వెంకట్రాంరెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఇదే స‌మ‌యంలో, మల్కాజిగిరి స్థానం నుంచి రంజిత్‌రెడ్డి, సబిత తనయుడు కార్తీక్‌రెడ్డితో పాటు మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాలపై కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే ఒక‌ట్రెండు రోజుల్లో ఈ అభ్య‌ర్థిత్వంపై స్ప‌ష్ట‌త‌కు రానున్న‌ట్లు స‌మాచారం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English