కేసీఆర్‌కే అంత టెక్కుంటే...నాకెంత ఉండాలి?

కేసీఆర్‌కే అంత టెక్కుంటే...నాకెంత ఉండాలి?

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న ఎదురుదాడిని మ‌రింత పెంచారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల శంఖారావంలో కేసీఆర్ మాట్లాడుతూ చంద్ర‌బాబు త‌న‌ను తిట్ట‌డ‌మే ప‌నిగా ఏపీ సీఎం చంద్ర‌బాబు పెట్టుకున్నార‌ని ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తాజాగా వివిధ బ‌హిరంగ‌ స‌భ‌ల్లో, పార్టీ నేత‌ల‌తో నిర్వ‌హించిన టెలీకాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ కేసీఆర్ తీరుపై మండిప‌డ్డారు. తెలంగాణలో పార్టీలు లేకుండా చేస్తున్న కేసీఆర్‌.. ఇప్పుడు ఏపీపై దాడి ప్రారంభించారని విమర్శించారు. ఆంధ్రులు.. రాక్షసులు, పేడ బిర్యానీ అంటూ కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

పార్టీకి చెందిన డేటాను పక్క రాష్ట్రం వ్యక్తులు చోరీ చేశారన్న బాబు.. కేసీఆర్‌కు దమ్ముంటే ఏపీకి వచ్చి తనపైన పోటీకి నిలబడాలని సవాల్‌ విసిరారు. తాను మూడు వేల సార్లు తిట్టానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంటున్నారని.. కానీ ఆంధ్రులను ఆయన తిట్టిన విషయం మరచిపోయారా అని ప్రశ్నించారు. అన్ని పార్టీలనూ ఏకం చేసే శక్తి టీడీపీకే ఉందన్న బాబు.. 25 మంది ఎంపీలుంటూ ప్రధానిని ఎంపిక చేసే అవకాశం ఉంటుందన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఉండేది తెరాస, వైకాపా మాత్రమేన‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు``. ఈ ఫెడరల్‌ ఫ్రంట్‌ పెట్టించింది మోడీయే. 17 సీట్లతో ఢిల్లీలో చక్రం తిప్పుతానని కేసీఆర్‌ చెబుతున్నవన్నీ మాయ మాటలే. పోలవరం ఆపాలని తెలంగాణ నేతలు పిటిషన్లు వేశారు.  అభివృద్ధి చేసిన నాపైనే కేసీఆర్‌ అభాండాలు వేస్తున్నారు.  తెలంగాణలో ఆయన చేస్తున్నవి దుర్మార్గమైన రాజకీయాలు. కాంగ్రెస్‌, తెదేపా శాసనసభ్యులను కేసీఆర్‌ లాక్కుంటున్నారు’’అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. నా దగ్గర పని చేసిన కేసీఆర్ కే టెక్కుంటే... నాకెంత టెక్కుంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ.. ఈ మూడు పార్టీలు ఒక్కటేన‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే.. హైదరాబాద్‌లో స్విచ్.. ఢిల్లీలో కరెంట్ ఉందంటూ సెటైర్లు వేశారు. ఇక డబ్బు ఇచ్చే వాళ్లకే వైసీపీ సీట్లు ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వైఎస్ జగన్‌కి డబ్బులు ఇస్తుంది... నాకు ఇచ్చే వాళ్లు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు ఆడబిడ్డల పసుపు కుంకుమలు తెంచి వేస్తుంటే.. నేను ఆడబిడ్డలకు పసుపు కుంకుమ అందించానని తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English