అర్థ‌రాత్రి ప‌వ‌న్ తో చ‌ర్చ‌లు.. జ‌న‌సేన‌లోకి మాజీ జేడీ!

అర్థ‌రాత్రి ప‌వ‌న్ తో చ‌ర్చ‌లు.. జ‌న‌సేన‌లోకి మాజీ జేడీ!

సీబీఐకి ప్ర‌జ‌ల్లో ఉన్న ఇమేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అలాంటి సీబీఐలో ప‌ని చేసిన ఒక అధికారికి ప్ర‌జ‌ల్లో ఇమేజ్ మాత్ర‌మే కాదు.. త‌మ స్ఫూర్తిదాత‌గా పేర్కొంటూ ఫ్లెక్సీలు క‌ట్టుకోవ‌టం.. పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌టం చాలా అరుదైన విష‌యం.

సీబీఐలో చాలామందే అధికారులు ఉంటారు. కానీ.. మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌కున్న ఇమేజ్ మాత్రం ఆయ‌న‌కు మాత్ర‌మే సొంత‌మేమో. గ‌డిచిన కొద్ది నెల‌లుగా వార్త‌ల్లో నిలుస్తున్న మాజీ జేడీ.. తాజాగా మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఊహించిన రీతిలో శ‌నివారం అర్థ‌రాత్రి వేళ‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ కావ‌టం స‌రికొత్త రాజ‌కీయ ప‌రిణామంగా పేర్కొంటున్నారు.

ఎన్నో సంచ‌ల‌న కేసుల ద‌ర్యాప్తు అధికారిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌నపై క్లీన్ చిట్ ఉంది. ఎలాంటి అవినీతి మ‌ర‌క ఆయ‌న‌కు అంట‌లేదు. 2018 మార్చిలో త‌న ప‌ద‌వికి స్వ‌చ్చంద ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన ఆయ‌న సొంత రాష్ట్రానికి సేవ చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా తిరుగుతున్నారు.

ఇందులో భాగంగా రైతులు.. మ‌హిళ‌లు.. విద్యార్థుల‌తో స‌మావేశాల్ని నిర్వ‌హిస్తున్నారు. వారి క‌ష్టాల్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న ఆయ‌న రాజ‌కీయాల్లోకి రానున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేర‌నున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. ఆ వెంట‌నే ఆయ‌న నిర్ణ‌యంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

అయితే.. త‌న మీద వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించిన జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ శ‌నివారం అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో భేటీ కావ‌టం.. ఆయ‌న పార్టీలో చేరేందుకు ఓకే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఆదివారం వెలువ‌డే అవ‌కాశం ఉంది.  గ‌డిచిన రెండు మూడు రోజులుగా జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీలో చేర‌తార‌ని.. ఆయ‌న పోటీ చేసేందుకు వీలుగా మంత్రి గంటా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భీమిలి సీటు నుంచి పోటీ చేస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం నేప‌థ్యంలో జ‌న‌సేన త‌ర‌ఫున ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేయ‌నున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగామారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English