న్యూజిలాండ్ నరమేధం.. ఆ యూట్యూబ్ ఛానెల్ వల్లేనా?

న్యూజిలాండ్ నరమేధం.. ఆ యూట్యూబ్ ఛానెల్ వల్లేనా?

ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశాల్లో ఒకటిగా న్యూజిలాండ్‌కు పేరుంది. అక్కడ క్రైమ్ రేట్ దాదాపు జీరో. అలాంటి దేశంలో శుక్రవారం ఒక వ్యక్తి నరమేధం సృష్టించాడు. మత విద్వేషంతో రెండు మసీదుల్లో దాడికి తెగబడ్డాడు. మెషీన్ గన్ తీసుకెళ్లి కనిపించిన వాళ్లను కనిపించినట్లు కాల్చి పారేశాడు. రెండు మసీదుల్లో జరిగిన ఈ దాడిలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐతే ఈ మారణకాండకు ఒక యూట్యూబ్ ఛానెల్ కారణమని వార్తలు వస్తున్నాయి.

మసీదుల్లో కాల్పులకు తెగబడ్డానికి  ఆరున్నర నిమిషాల ముందు నిందితుడు కెమెరా ఆన్ చేసి ఆన్‌ లైన్‌ స్ట్రీమింగ్‌ మొదలు పెట్టాడు. తాను విచక్షణారహితంగా కాల్పులు జరపడాన్ని అతను ఫేస్ బుక్ లైవ్ ద్వారా కూడా చూపించాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఐతే వీడియో స్ట్రీమింగ్ మొదలుపెట్టే ముందు అతను ఒక సందేశం ఇవ్వడం గమనార్హం. ''సరే.. ఇక పార్టీ మొదలుపెడదాం. 'ప్యూడైపై'ను సబ్‌స్క్రైబ్‌ చేయడం మరిచిపోవద్దు కుర్రాళ్లూ'' అని అందులో అతను పేర్కొన్నాడు. ఆ మాట చెప్పిన అనంతరం మసీదుల్లోకి చొరబడి కాల్పులు మొదలు పెట్టాడు.

అతను చెప్పిన 'ఫ్యూడైఫై' అనేది ఒక యూట్యూబ్‌ ఛానల్‌. ఇది అనేక వివాదాలతో ముడిపడ్డ ఛానెల్. స్వీడన్‌కు చెందిన ఫెలిక్స్‌ జైల్‌బర్గ్‌ నిర్వహిస్తున్న ప్యూడైపై ప్రపంచంలోనే అత్యధికంగా 8.9 కోట్ల మంది సబ్‌స్క్రైబ్‌ చేసిన ఛానల్‌. ఇందులో అనేక హాస్య, వ్యంగ్య కార్యక్రమాలు వస్తుంటాయి. ఐతే జనాల్ని మరింతగా దీనికి అడిక్ట్ చేయడం కోసం ఫెలిక్స్ అనేక వివాదాస్పద కార్యక్రమాలు ప్రసారం చేస్తుంటాడు. కరుడుగట్టిన జాతివిద్వేష భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ.. కొన్ని జాతుల్ని కించపర్చేలా వ్యంగ్య కార్యక్రమాలను తన ఛానల్‌లో ప్రసారం చేస్తుంటాడు.

యూధులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు బోలెడన్ని వస్తుంటాయి. అలాగే మహిళల్ని కించపరిచే కార్యక్రమాలకూ లోటు లేదు. ఐతే వివాదాలే ఛానెల్‌కు పాపులారిటీ తెస్తాయని అతను నమ్ముతుంటాడు. కాబట్టే వాటిని ప్రోత్సహిస్తున్నాడు. మసీదులో కాల్పులకు తెగబడ్డ నిందితుడు ఈ ఛానెల్ చూసి ఇన్‌స్పైర్ అయి దాడులకు దిగినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈ ఛానల్‌తో యూట్యూబ్‌, డిస్నీలు డబ్బు చెల్లించి వీడియోలను చేయిస్తుండేవి. కానీ జాతివిద్వేషకుడిగా పేరు రావడంతో ఒప్పందాలు రద్దు చేసుకొన్నాయి.

ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం ఈ ఛానల్‌లో ఒక ప్రకటన వీడియో రావాలంటే మన కరెన్సీలో రూ.3.10 కోట్లు చెల్లించాలి. ఇన్నాళ్లూ ఎన్ని వివాదాస్పద కార్యక్రమాలు ప్రసారం చేసినా చెల్లిపోయింది కానీ.. క్రైస్ట్ చర్చ్ ఉదంతంతో ఫెలిక్స్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడి ఛానెల్‌ను బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English