అవసరమా ఈ బయోపిక్?

అవసరమా ఈ బయోపిక్?

హిందీలో ‘బాగ్ మిల్కా బాగ్’ సినిమా హిట్టవ్వగానే స్పోర్ట్స్ బయోపిక్స్ వరుస కట్టేశాయి. కానీ దాని తర్వాత అరడజను దాకా ఈ జానర్లో సినిమాలు రాగా.. అందులో విజయవంతమైంది ఒక్క ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ మాత్రమే. మిగతావేవీ ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. అయినా కూడా స్పోర్ట్స్ బయోపిక్స్ ఆగడం లేదు. మిల్కాసింగ్, ధోనిల సినిమాలు ఆడాయంటే వాళ్లకున్న ఆకర్షణ వేరు. వారి కథల్లో ఉన్న డ్రామా వేరు. అన్ని కథలకూ అలాంటి ఆకర్షణ ఉండదు. సైనా నెహ్వాల్ బయోపిక్ ఈ కోవలోకే వస్తుంది. సైనా కెరీర్ గురించి తెలియని విషయాలేమీ లేవు. ఆమె జీవితం తెరిచిన పుస్తకం. చిన్నప్పటి నుంచి సైనా వ్యక్తిగత జీవితం, కెరీర్లో నాటకీయత తక్కువే. అయినప్పటికీ ఆమె మీద సినిమా తీసేయాలనుకున్నారు.

ఈ బయోపిక్ రెండేళ్ల ముందు నుంచి చర్చల్లో ఉంది. కానీ ఇప్పటిదాకా అడుగే ముందుకు పడలేదు. మధ్యలో సినిమా ఆగినట్లు వార్తలొచ్చాయి. మళ్లీ షూటింగ్ మొదలైందన్నారు. శ్రద్ధా కపూర్ సైనా పాత్ర కోసం ఎంపికై.. కొన్ని నెలల పాటు శిక్షణ తీసుకుంది. తీరా చూస్తే ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రకటన వచ్చింది. తన స్థానంలోకి పరిణీతి వచ్చిందన్నది తాజా సమాచారం. ఐతే సైనా పాత్రకు శ్రద్ధ సెట్ అయినట్లుగా పరిణీతి సూటవుతుందా అన్నది సందేహమే. ‘సైనా’ సినిమా కోసం అంత కష్టపడ్డ శ్రద్ధనే చివరికి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. మరి పరిణీతి మాత్రం ఈ సినిమాలో చేస్తుందా అన్నది సందేహమే. ఆమె సైనా పాత్రకు సూటవుతుందా.. ఈ సినిమా చేస్తుందా లేదా అన్నది పక్కన పెడితే.. ప్రేక్షకుల్లో ఏమంత ఆసక్తి లేని ఈ బయోపిక్ తీయడం అవసరమా అన్న చర్చ కూడా నడుస్తోందిప్పుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English