వివేకానంద మిస్ట‌రీ మ‌ర‌ణంపై సందేహాలెన్నో?

వివేకానంద మిస్ట‌రీ మ‌ర‌ణంపై సందేహాలెన్నో?

సాంకేతికంగా దూసుకుపోతున్న‌ట్లుగా గొప్ప‌లు చెప్పుకుంటుంటాం. ప్ర‌పంచంలో ఎక్క‌డేం జ‌రిగినా చిటికెలో స‌మాచారం అందే ప‌రిస్థితి. అంతేనా.. క్ష‌ణాల వ్య‌వ‌ధిలో వీడియోలు.. ఫోటోల‌తో జ‌రిగే హ‌డావుడి అంతా ఇంతా కాదు. అలాంటిది ఒక ప్ర‌ముఖ రాజ‌కీయ కుటుంబానికి చెందిన మాజీ ఎంపీ ఒక‌రు దారుణ హ‌త్య‌కు గురైతే.. ఆయ‌న గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు వార్త‌లు రావ‌టం ఏమిటి?  గంట‌ల త‌ర్వాత అనుమానాస్ప‌ద మ‌ర‌ణంగా.. త‌ర్వాత హ‌త్య‌గా తేల‌టం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారిన వివేకానంద‌రెడ్డి హ‌త్య వ్య‌వ‌హారంలో వ‌చ్చే అనుమానాలు అన్నిఇన్ని కావు. శుక్ర‌వారం రాత్రి మీడియాతో మాట్లాడిన జ‌గ‌న్ చేసిన వాద‌న విచిత్రంగా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. సొంత మీడియా ఉన్న రాజ‌కీయ అధినేత నోటి నుంచి ఈ త‌ర‌హా మాట‌లా? అన్న భావ‌న ప‌లువురికి క‌లిగింది. త‌న సొంత బాబాయ్ మ‌ర‌ణానికి సంబంధించిన ఫ‌స్ట్ హ్యాండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ జ‌గ‌న్ కు ఉండ‌దా?  ఎవ‌రైనా ఇంట్లో ఏదైనా జ‌రిగిన‌ప్పుడు.. దానికి సంబంధించిన స‌మాచారం మిగిలిన వారి కంటే మెరుగ్గా ఉంటుంది. లోగుట్టు విష‌యాలు ఉన్నా అవి కూడా వారికే ముందు తెలుస్తాయి. ఇది ఎవ‌రైనా ఒప్పుకునే అంశం.

మ‌రి.. అలాంట‌ప్పుడు త‌న బాబాయ్ మ‌ర‌ణానికి సంబంధించి మిగిలిన మీడియా సంస్థ‌ల మాదిరి గుండెపోటుతో హ‌ఠ్మాన్మ‌ర‌ణం అన్న వార్త‌ల్ని ఇచ్చారే కానీ.. క‌నీసం అనుమానాస్ప‌ద మ‌ర‌ణ‌మ‌న్న వార్త ఇవ్వ‌క‌పోవ‌టం దేనికి నిద‌ర్శ‌నం. త‌న తండ్రికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన సోద‌రుడు దారుణంగా హ‌త్య‌కు గురైతే.. ఆ విష‌యం మీద రాత్రికి కానీ మీడియా ముందుకు జ‌గ‌న్ రాక‌పోవ‌ట‌మా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌.

ఇక్క‌డ‌.. బాబాయ్ హ‌త్య‌తో జ‌గ‌న్ కు ఏదో లింకు ఉంద‌న్న చెత్త వాద‌న‌ను వినిపించ‌టం మా ఉద్దేశ్యం ఎంత మాత్రం కాదు. కాకుంటే.. మిగిలిన మీడియా సంస్థ‌ల మాదిరే తొలుత గుండెపోటు.. త‌ర్వాత అనుమానాస్ప‌ద మృతి.. ఆ త‌ర్వాత మాత్ర‌మే హ‌త్య అన్న వార్త‌ల్ని జ‌గ‌న్ మీడియా సంస్థ‌లు ఇవ్వ‌టంలో ఔచిత్యం ఏమిటి? అన్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

బాబాయ్ హ‌త్య‌కు సంబంధించిన స‌మాచారాన్ని త‌న సొంత మీడియా సంస్థ‌లోనే ఆల‌స్యంగా ప్ర‌పంచానికి చెప్పిన జ‌గ‌న్ కు.. ఇత‌రుల్ని దూషించే హ‌క్కు ఉంటుందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

జ‌గ‌న్ విమ‌ర్శ‌ల్ని చూస్తే.. త‌న బాబాయ్ ను దారుణంగా హ‌త‌మార్చార‌ని.. త‌ల మీదే నాలుగైదు వేట్లు ఉన్నాయ‌ని.. బెడ్రూంలో చంపి.. బాత్రూంకు తీసుకెళ్లి అక్క‌డ మ‌ర‌ణించిన‌ట్లుగా ఆరోపించారు. అది నిజ‌మే అనుకుందాం. ఒక‌వేళ అదే జ‌రిగితే.. వెంట‌నే ఆ విష‌యాన్ని వెల్ల‌డించి.. బాబాయ్ హ‌త్య మీద త‌మ‌కున్న అనుమానాల్ని ప్ర‌శ్నించాలి క‌దా?  ఒక‌వేళ అధికార‌ప‌క్షం కానీ.. పోలీసులు కానీ ఆధారాల్ని మాయం చేసే ప‌రిస్థితులు ఉంటే వాటి వివ‌రాల్ని త‌న మీడియా ద్వారా వెల్ల‌డించాలి క‌దా?  కానీ.. ఇవేమీ ఎందుకు జ‌ర‌గ‌లేదు?

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాత్రివేళ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణం త‌న‌కు బాధ క‌లిగించింద‌న్న ఆయ‌న‌.. జ‌గ‌న్ ఆరోప‌ణ‌ల్ని బ‌లంగా త‌ప్పు ప‌ట్టారు. అంతేకాదు.. ఆయ‌న కొన్ని ప్ర‌శ్నల్ని సంధించారు.

పీఏ ఇంటికి వెళ్లినా ఎందుకు త‌లుపులు తీయ‌లేదు?  సీఐ ఇంటికి వెళ్లే లోపే ర‌క్త‌పు మ‌ర‌క‌ల్ని ఎందుకు తుడిచేశారు?  మృత‌దేహాన్ని బాత్రూం నుంచి బెడ్ రూంకు ఎవ‌రు త‌ర‌లించారు?  పోస్ట్ మార్టం జ‌రిగే వ‌ర‌కూ గాయాల విష‌యం ఎందుకు బ‌య‌ట‌పెట్ట‌లేదు?   గుండెపోటు అని ఎందుకు న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు?  హ‌త్య కేసును ఎందుకు దాచి పెట్టారు?  ఆసుప‌త్రికి తీసుకెళ్లే వ‌ర‌కూ గాయాల వివ‌రాలు ఎందుకు దాచారు?  గుండెపోటుతో చ‌నిపోయార‌ని పోలీసుల‌ను ఎందుకు న‌మ్మించారు?  కేసులు కూడా అవ‌స‌రం లేద‌ని ఎందుకు చెప్పారు?  హ‌త్య అని తేలాక త‌మ  మీద దాడి మొద‌లెట్టారంటూ చంద్ర‌బాబు వేసిన ప్ర‌శ్న‌లు స‌రికొత్త సందేహాలు వ‌చ్చేలా చేయ‌టం ఖాయం. మ‌రి.. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పేవారెవ‌రు? అన్న‌ది ఇప్పుడు అస‌లు ప్ర‌శ్న అని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English