ఎంపీ బ‌రిలో రేవంత్‌...8 మంది కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా

ఎంపీ బ‌రిలో రేవంత్‌...8 మంది కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా

తెలంగాణలో జ‌రుగుతున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మిగ‌తా పార్టీల‌ కంటే ముందే త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. త‌మ పార్టీ త‌ర‌ఫున పార్ల‌మెంటు ఎన్నిక‌ల బ‌రిలో దిగే నాయ‌కుల పేర్లు వెల్ల‌డించింది. తొలి ద‌శ‌లో ఎనిమిది మంది పేర్లు ప్ర‌క‌టించిని కాంగ్రెస్ మ‌లి ద‌శ‌లో మ‌రో తొమ్మిది మంది పేర్లు ప్ర‌క‌టించ‌నుంది. కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌ల్కాజ్‌గిరి నుంచి బ‌రిలో దిగ‌నున్నారు.

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో నేడు జ‌రిగింది.తెలంగాణ‌లోని 17 లోక్‌సభ స్ధానాలపై సీఈసీలో చర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు, అభ్య‌ర్థులకు సంబంధించిన వివ‌రాల‌ను నేత‌లు క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేసి పేర్లు ఖ‌రారు చేశారు. అనంత‌రం తెలంగాణలో ఎనిమిది లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గాల అభ్యర్థులతో మొదటి జాబితాను ఖ‌రారు చేశారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం రాహుల్ గాంధీయే తీసుకున్న‌ట్లు స‌మాచారం. శ‌నివారం మిగిలిన పేర్ల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఖ‌రారైన పేర్లు ఇవి.
1.ఆదిలాబాద్..రమేష్ రాథోడ్
2. మహబూబాబాద్.. బలరాం నాయక్
3.పెద్దపల్లి ..ఎ.చంద్రశేఖర్
4.కరీంనగర్..పొన్నం ప్రభాకర్
5.మల్కాజిగిరి.. రేవంత్ రెడ్డి
6. జహీరాబాద్.. మదన్ మోహన్
7. చేవెళ్ల.. కొండ విశ్వేశ్వర్ రెడ్డి
8.మెదక్. గాలి అనిల్ కుమార్..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English