వివేకాను గొడ్డ‌లితో న‌రికి చంపారు..ప్రాథ‌మిక రిపోర్ట్‌లో సంచ‌ల‌నం

వివేకాను గొడ్డ‌లితో న‌రికి చంపారు..ప్రాథ‌మిక రిపోర్ట్‌లో సంచ‌ల‌నం

సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త వైఎస్ వివేకానంద రెడ్డి హ‌ఠ‌న్మ‌ర‌ణం విష‌యంలో ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ తెల్లవారుజామున వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. వివేకానందరెడ్డి అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే మరణించారు. వివేకా నుదుటి ప్రాంతం, తల వెనుకభాగంగాలో బలమైన గాయాలుండడంతో ఆయ‌న మ‌ర‌ణంపై అనుమానాలు రేకెత్తాయి. దీంతో, ఆయన సోదరుడి కుమారుడు, ఎంపీ అవినాష్‌రెడ్డి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

'మా పెదనాన్న తల మీద, చేతి వేళ్లపైన, ముఖంపైన గాయాలున్నాయి. ఎవరో దాడి చేయడం వల్లే ఆయన మరణించినట్టు ఉంది. దీని వెనుక ఏదో కుట్ర ఉంది' అని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిష్పాక్షికంగా దర్యాప్తు చేపట్టాలని కోరారు.

ఇదిలాఉండ‌గా, వైఎస్ వివేకానంద మృతదేహానికి వైద్యులు పోస్ట్ మార్టం పూర్తి చేశారు. ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో కీల‌క అంశాలు వెలువ‌డ్డాయి.  ఒంటిపై మొత్తం ఏడు గాయాలు ఉండగా... వైఎస్ వివేక నుదుటిపై రెండు లోతైన గాయాలు... తల వెనుకాల బలమైన గాయం ఉంది. తొడ, చేతులపై కూడా పదునైన గాయాలు ఉన్నట్టు స‌మాచారం.

మొత్తం ఏడు బలమైన గాయాలను గుర్తించిన‌ట్లు పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యుల బృందం తెలిపింది. గంట పాటు పోస్ట్‌మార్టం చేశామ‌ని, కీలకమైన అవయవాలు సేకరించినట్టు వివ‌రించింది. సేకరించిన అవయవాలను ఫోరెన్సిక్‌కు పంపుతున్నామని వెల్లడించారు. వీటి పరిశీలనకు కర్నూలు నుంచి పులివెందులకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం రానుంది. ఈ బృందం ఇచ్చే నివేదిక కీల‌కం కానుంది.

ఇదిలాఉండ‌గా, ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ మీడియాతో మాట్లాడుతూ హత్య జరిగిందని భావిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు లోపల ఏం జ రిగిందో తెలుసుకుంటున్నామని వెల్లడించారు.ఈ కేసులో తమకు కొన్ని క్లూస్‌ దొరికాయని, వాటి ఆధారంగా విచారణ కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కాగా, వైఎస్ వివేకా మృతదేహాన్ని ఆయన ఇంటికి తరలిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English