ప‌వ‌న్ ది ఒంట‌రి పోరు కాదు.. కొత్త పొత్తు పెట్టుకున్నారు!

ప‌వ‌న్ ది ఒంట‌రి పోరు కాదు.. కొత్త పొత్తు పెట్టుకున్నారు!

ఈసారి ఎవ‌రితోనూ పొత్తు లేదు. ఒంట‌రిగా పోటీ చేస్తున్నాం. ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌నున్నామ‌ని చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఊహించ‌నివిధంగా కొత్త మిత్రుడితో జ‌త క‌ట్టారు. ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌ని రీతిలో ఆయ‌న కొత్త పొత్తు ఉండ‌టం విశేషం. రానున్న అసెంబ్లీ.. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త మిత్రుడితో క‌లిసి పోటీ చేస్తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

ఇంత‌కీ.. ప‌వ‌న్ కొత్త స్నేహం ఎవ‌రితోనో తెలుసా?  బీఎస్పీ అధినేత్రి మాయావ‌తితో. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోకు వెళ్లిన ప‌వ‌న్‌.. అక్క‌డ బీఎస్పీ అధినేత్రితో భేటీ అయ్యారు. ఎన్నిక‌ల్లో పొత్తుపై ఆమెతో చ‌ర్చ‌లు జ‌రిపారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. అంబేడ్క‌ర్ ఆశ‌యాల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న ఆయ‌న‌.. మాయావ‌తి మార్గ‌నిర్దేశ‌క‌త్వం చాలా అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయాప‌డ్డారు.

వామ‌ప‌క్షాల‌తో క‌లిసి వెళ్లాల‌ని ఇప్ప‌టికే చెప్పామ‌ని.. తాజాగా బీఎస్పీతో క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని తాము డిసైడ్ అయిన‌ట్లు ప‌వ‌న్ వెల్ల‌డించారు. చిత్ర‌..విచిత్ర‌మైన రాజ‌కీయ నిర్ణ‌యాలు తీసుకునే ప‌వ‌న్‌.. బీఎస్పీతో జ‌త క‌ట్ట‌టం ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా చెప్పాలి.  రెండు తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీకి ఉన్న బ‌లం ఎంత‌న్న విష‌యం తెలుగు వారికి తెలిసిందే.

అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవ‌టానికి ప‌వ‌న్ ప్ర‌త్యేకించి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వెళ్లి మాయావ‌తితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌ట‌మా? అంటూ క్వ‌శ్చ‌న్ చేస్తున్న వారు లేక‌పోలేదు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మాయావ‌తి యూపీలో బ‌ల‌మైన రాజ‌కీయ‌ప‌క్ష‌మే కానీ.. అధికారాన్ని సొంతం చేసుకునే ప‌రిస్థితి లేదు. అలాంటి రాజ‌కీయ పార్టీతో ప‌వ‌న్ ప్ర‌త్యేకంగా వెల్లి మ‌రి.. పొత్తు పెట్టుకోవ‌టం ఏమిటో ప‌వ‌న్ కే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English