టీ కాంగ్రెస్ లో చివ‌రికి మిగిలే ఎమ్మెల్యేలు ఎవ‌రంటే?

టీ కాంగ్రెస్ లో చివ‌రికి మిగిలే ఎమ్మెల్యేలు ఎవ‌రంటే?

ఎవ‌రో త‌రుముతున్న‌ట్లు.. ఇప్పుడు కాకుంటే మ‌రెప్ప‌టికి సాధ్యం కాద‌న్న హ‌డావుడిగా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు చొప్పున టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రుగా గులాబీ కారు ఎక్కేస్తున్నారు. తాము క‌నుసైగ చేయాలే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ‌రుస పెడ‌తార‌న్న మాట కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన రోజుల వ్య‌వ‌ధిలోనే.. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను మ‌రింత వేగం చేశారు గులాబీ బాస్‌.

ఇప్ప‌టికే ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలోకి చేరేందుకు రెఢీ అయితే.. రానున్న కొద్ది రోజుల్లో మ‌రో ఏడుగురు ఎమ్మెల్యేలు పింక్ కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ మ‌ధ్య‌నే జ‌రిగిన టీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మొత్తం 19 మంది ఎమ్మెల్యేల్ని గెలుచుకుంటే.. ఇప్ప‌టికి ఆరుగురు ఎమ్మెల్యేలు కండువా మార్చేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసే నాటికి త‌క్కువ‌లో త‌క్కువ మ‌రో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి చేర్చుకోవ‌టం ఖాయ‌మంటున్నారు. టీ కాంగ్రెస్ కు ప్ర‌తిప‌క్ష హోదా సంగ‌తి త‌ర్వాత‌.. పార్టీని రాష్ట్రంలో నామ‌రూపాల్లేకుండా చేయ‌ట‌మే కేసీఆర్ ల‌క్ష్యమ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇప్ప‌టికే టీఆర్ఎస్ లో చేరేందుకు రెఢీ అయిన నేత‌లు తెలిసిందే. మ‌రి.. రానున్న రోజుల్లో పార్టీ నుంచి జంప్ అయ్యే అవ‌కాశం ఉన్న ఎమ్మెల్యేలు ఎవ‌రు?.. అంతిమంగా పార్టీలో మిగిలే ఎమ్మెల్యేలు ఎవ‌ర‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం ప్ర‌కారం ఇప్ప‌టికి బ‌య‌ట‌ప‌డ్డ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని మిన‌హాయిస్తే.. రానున్న రోజుల్లో పార్టీ మారే అవ‌కాశం పుష్క‌లంగా ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవ‌రంటే..

1. సురేంద‌ర్

2.  జ‌గ్గారెడ్డి

3. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్

4. వీర‌య్య

5. సుధీర్ రెడ్డి

6. వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు

7. హ‌ర‌ష‌వ‌ర్ద‌న్ రెడ్డి

కేసీఆర్ సంధించిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు లొంగ‌క‌.. పార్టీలోనే ఉండిపోయే అవ‌కాశం ఉన్న ఎమ్మెల్యేల జాబితాను చూస్తే.. ఆరుగురు మిగిలే అవ‌కాశం ఉంది. ఆ ఆరుగురు ఎవ‌రంటే?

1. మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌

2. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

3. గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి

4. సీత‌క్క‌

5. శ్రీ‌ధ‌ర్ బాబు

6. పైల‌ట్ రోహిత్ రెడ్డి

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English