చీమూ, నెత్తురు ఉంటే ఫిరాయింపులు ఆపు కేసీఆర్‌

చీమూ, నెత్తురు ఉంటే ఫిరాయింపులు ఆపు కేసీఆర్‌

ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌రి వెంట ఒక‌రు అన్న‌ట్లుగా ప్ర‌జాప్ర‌తినిధులు పార్టీ మ‌మారుతుండ‌టం తీవ్ర చ‌ర్చనీయాంశం అయిన నేప‌థ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ విరుచుకుప‌డ్డారు. గురువారం ఆయన హైద్రాబాద్ లో మీడియా తో మాట్లాడుతూ ఎమ్యెల్సీ ఎన్నికల ప్రకటన రాగానే కేసీఆర్ రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహించడం మొదలు పెట్టారని, గత పాలనలో కూడా ఇదే చేసారని ఆయన విమర్శించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గులేనితనంతో పాలన సాగిస్తోంది, రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ దాన్ని ఏదో గొప్ప పనిగా చెప్పు కోవడం రాజకీయ దివాళా కోరు తనం అని భ‌ట్టి మండిపడ్డారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, దిశా నిర్దేశం చేస్తున్నామని కేసీఆర్ చేపుతున్నారని ఆదర్శం అంటే ఇదేనా అని దుయ్యబట్టారు. కేసీఆర్ కు ప్రతిపక్షం ఉంటే ప్రశ్నిస్తారనే భయం ఉందని జవాబు చెప్పే ధైర్యం లేకనే ప్రతిపక్షం లేకుండా నిర్ములించాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను గౌరవించే మంచి నేత‌లు ఉన్న దేశంలో కేసీఆర్ ఒక రాక్షస పాలన చేస్తున్నారని విరుచుకుప‌డ్డారు.

తన అధికార బలంతో, ఆర్థిక బలంతో ప్రలోభాలు పెడుతూ, బెదిరింపులకు పాల్పడుతూ కాంగ్రెస్ శాసన సభ్యులను టీఆర్ఎస్‌లో బలవంతంగా చేర్చుకోవడం గొప్ప విష‌య‌మ‌ని కేసీఆర్ భావిస్తున్నారా? అని భ‌ట్టి ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేసి చెయ్యి గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్థులను గెలిపిస్తే  వారి త్యాగాలను అమ్ముకుంటారా అని పార్టీ మారిన అభ్యర్థులను ఆయన నిలదీశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపిస్తే వారి ఆశయాలను ధనానికి ప్రలోభాలకు తాకట్టు పెడతారా, సిగ్గు ఎగ్గూ లేకుండా పార్టీ మారుతారా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ను చీము నెత్తురు, నీతి, నిజాయితీ ఉన్నా, చట్టం, రాజ్యాంగ పైన గౌరవం ఉన్నా ఫిరాయింపులను ఆపేయాలని కోరారు. కాంగ్రెస్ కు రాజీనామాలు చేసిన వారి చేత శాసన సభ సభ్యత్వాలకు రాజీనామా చేయించి పోటీకి సిద్ధపడలని ఆయన డిమాండ్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English