టార్గెట్ రాజాసింగ్‌..బీజేపీలో కీల‌క ప‌రిణామాలు

టార్గెట్ రాజాసింగ్‌..బీజేపీలో కీల‌క ప‌రిణామాలు

రాజాసింగ్‌....బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత‌. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఘోరంగా ఓడిపోయినప్ప‌టికీ...గెలిచిన ఏకైక నాయ‌కుడు. 119 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి నేతలు ఎన్నికల్లో ఓడినా రాజాసింగ్ మాత్రం మళ్లీ గెలిచారు. అయిన‌ప్ప‌టికీ రాజాసింగ్ గెలిచారు. గోషామహాల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాజాసింగ్ గెలవడం వరుసగా రెండోసారి. ఇంతటి కీల‌క‌మైన‌ నేత‌కు ఆ పార్టీలో కుంప‌ట్లు మొద‌ల‌య్యాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం చోటుచేసుకుంటున్న ప‌రిణామాలే ఇందుకు నిద‌ర్శ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

2014లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రాష్ట్ర బీజేపీ నాయకులతో రాజాసింగ్ కు సంబంధాలు అంతంతమాత్రమే. రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండా రాజాసింగ్ స్వతంత్రంగా వ్యవహరిస్తారనే టాక్ పార్టీలో ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ హ‌వా ఉన్న‌ప్ప‌టికీ గోషామ‌హ‌ల్‌లో మాత్రం సొంత స‌త్తాతో రాజాసింగ్ గెలుపొందారు. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా రాజాసింగ్ ను రాష్ట్ర పార్టీ నాయకులు దూరం పెడుతున్నారు. రాష్ట్రం నుంచి ఆయనొక్కరే గెలవ‌డంతో, బీజేఎల్పీ లీడర్ కూడా ఆయనే అయ్యారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశాలకు కానీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో కానీ ఎక్కడా రాజాసింగ్ ను ఆహ్వానించ‌డం లేదని స‌మాచారం.

ఇటీవల ఢిల్లీలో అమిత్‌షాతో పార్లమెంట్ అభ్యర్థుల మీటింగ్ లో నలుగురు బీజేపీ నేతలు వెళ్లి కలిశారు. లక్ష్మణ్, కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, రామచంద్రరావు అమిత్ షాను కలిసిన వారిలో ఉన్నారు. అయితే బీజేపీ ప్రోటోకాల్ ప్రకారం అభ్యర్థుల ఎంపికలో కచ్చితంగా బీజేఎల్పీ నేతకు భాగ‌స్వామ్యం క‌ల్పించాలి. కానీ, రాజాసింగ్ ను రాష్ట్ర నాయకత్వం దూరం పెడుతోంది. అసలు రాజాసింగ్ కు బీజేపీకి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో రాజాసింగ్‌కు చోటు క‌ల్పిస్తారా? లేదా అన్నది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English