ఇంత సస్పెన్స్‌ ఏంటి పవన్‌.!

ఇంత సస్పెన్స్‌ ఏంటి పవన్‌.!

మొత్తానికి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ నుంచి ఫస్ట్ లిస్ట్‌ వచ్చేసింది. 4గురు ఎంపీ అభ్యర్థులు, 32 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తన తొలి జాబితాను అర్థరాత్రి అనౌన్స్‌ చేశాడు పవన్‌. ఇందులో ఆల్‌రెడీ ఆకుల సత్యనారాయణ, డీఎంఆర్‌ శేఖర్‌ పేర్లు గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు కొత్తగా విశాఖ నుంచి గేదెల్ శ్రీనుబాబు, అనకాపల్లి నుంచి చింతల పార్థసారధికి అవకాశం కల్పించాడు. ఇక ఎమ్మెల్యే సీట్లను 8 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చాడు.

అంతా బాగానే ఉంది. కానీ అసలు తాను ఎక్కడనుంచి పోటీ చేస్తాను అనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు సస్పెన్స్‌ గానే ఉంచుతున్నాడు పవన్‌. జనసేన మొదటి లిస్ట్‌ లో పవన్‌కల్యాణ్‌ పేరు లేదు. తెనాలి నుంచి పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ పేరు కూడా ఉంది. అయితే.. తన పేరుని లిస్ట్‌ లో కావాలనే  పెట్టలేదని తెలుస్తోంది. అయితే.. తన నియోజకవర్గం గురించి పవన్‌ అంత సస్పెన్స్‌ మెయింటైన్‌ చెయ్యాల్సినంత అవసపం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

లెక్కప్రకారం తాను ఎక్కడనుంచి పోటీ చెయ్యాలో పవన్‌ కల్యాణ్‌కు ఇప్పటికే ఒక క్లియర్‌ ఐడియా ఉంది. అయితే.. అతని పరిశీలనలో రెండు మూడు నియోజకవర్గాలున్నాయి. కాపుఓట్లు, జనసేన కార్యకర్తలు ఎక్కువుగా ఉన్న పిఠాపురం నుంచి పోటీ చెయ్యాలా లేదా తిరుపతి, గాజువాకల్లో ఒకదాన్ని ఎంచుకోవాలా అనే విషయంలో ఏదీ తేల్చుకోలేకపోతున్నాడు. అందుకే పవన్‌ తన నియోజకవర్గంపై సస్పెన్స్‌ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English