హైద‌రాబాద్ టు ఏపీ రైలుబండ్లు ఫుల్!

హైద‌రాబాద్ టు ఏపీ రైలుబండ్లు ఫుల్!

తెలుగు ప్ర‌జ‌ల‌కు ఏప్రిల్ 10 ఇప్పుడు కీల‌కంగా మారింది. మ‌రి ముఖ్యంగా rnహైద‌రాబాద్ లో ఉండే ఏపీ ప్రాంతానికి చెందిన వారికి ఇప్పుడీ డేట్ చాలా rnముఖ్య‌మైంది. ఆఫీసుల్లో సెల‌వుల‌కు అప్లై చేసుకోవ‌ట‌మే కాదు.. ట్రైన్లు.. rnబ‌స్సుల టికెట్ల‌కు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. ఇంత‌కీ ఏప్రిల్ 10కు అంత rnప్రాధాన్య‌త ఏమంటారా? ఆ ప‌క్క రోజే ఏపీలో పోలింగ్ జ‌ర‌గ‌ట‌మే కార‌ణం.

ఏపీకిrn చెందిన ల‌క్ష‌లాది మంది హైద‌రాబాద్ తో పాటు.. చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో rnఉండ‌టం తెలిసిందే.చాలామందికి ఏపీలో ఓటు ఉంటే.. ప‌లువురికి రెండు చోట్ల rnఓట్లు ఉన్న ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో జ‌రిగే లోక్ స‌భ ఎన్నిక‌ల rnకంటే కూడా ఏపీలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లకు ఉన్న ప్రాధాన్య‌త అంతా ఇంతా rnకాదు. హోరాహోరీగా సాగుతున్న ఎన్నిక‌ల్లో త‌మ ఓటును వేసేందుకు వీలుగా rnఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన వెంట‌నే ఓట‌ర్లు తమ ఎల‌క్ష‌న్ జ‌ర్నీకి rnఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఏప్రిల్ 10 సాయంత్రం నుంచి రాత్రి rnమ‌ధ్య‌లో ఏపీకి బ‌య‌లుదేరే ప‌లు రైళ్ల‌ల్లో ఒక్క‌టంటే ఒక్క రిజ‌ర్వ్ టికెట్rn ల‌భించ‌క‌పోవ‌టం చూస్తే.. హైద‌రాబాద్ లోని ఏపీ ప్ర‌జ‌లు ఎన్నిక‌ల‌కు ఎంత rnప్రాధాన్య‌త ఇస్తున్నారో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పొచ్చు. ఇప్ప‌టికే rnప‌లు ఐటీ కంపెనీల‌తో పాటు.. ఇత‌ర‌త్రా కంపెనీలు.. సూప‌ర్ మార్కెట్లు.. ఇత‌రrn కార్యాల‌యాల‌కు చెందిన ఉద్యోగులు ప‌లువురు ఇప్ప‌టికే ఏప్రిల్ 10 రాత్రి rnప్ర‌యాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

దీంతో.. పెద్ద పండుగ‌ల వేళ ఎలాంటి హ‌డావుడి ఉంటుందో.. ఏప్రిల్ 10న అలాంటి ప‌రిస్థితే హైద‌రాబాద్‌లో ఉంటుంద‌ని చెబుతున్నారు.

హైద‌రాబాద్rn నుంచి ఏపీకి వెళ్లే చాలా రైళ్లల్లో ఏప్రిల్ 10 టికెట్లు వెయిటింగ్ లిస్ట్ rnను దాటేసి రిగ్రెట్ కు చేరిపోయాయి. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా గోదావ‌రి..విశాఖ rnఎక్స్ ప్రెస్ తో పాటు.. ప‌లు రైళ్ల‌ను చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌లrn వేళ‌.. ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డ‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట బ‌లంగా rnవినిపిస్తోంది. బ‌స్సుల‌తో పోలిస్తే రైలు ప్ర‌యాణం ఛార్జీలు త‌క్కువ‌గా rnఉండ‌టం ఒక ఎత్తు అయితే..ప్ర‌యాణ గంట‌లు కూడా క‌లిసి వ‌స్తాయ‌ని rnచెబుతున్నారు. పోలింగ్ నేప‌థ్యంలో హైద‌రాబాద్ నుంచి ఏపీకి ప్ర‌త్యేకంగా rnరైళ్ల‌ను న‌డ‌పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. దీనిపై rnద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English