బాబు ప్ర‌శ్నఃమీకు స్కీమాంధ్ర కావాలా...స్కామాంధ్ర కావాలా?

బాబు ప్ర‌శ్నఃమీకు స్కీమాంధ్ర కావాలా...స్కామాంధ్ర కావాలా?

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై తీవ్రంగా మండిప‌డ్డారు. జ‌గ‌న్ అవినీతి తాజాగా ఈడీ లేఖ రూపంలో బ‌య‌ట‌ప‌డిన నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ ఈడీ లేఖ‌పై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నారు. సీబీఐ మొద్దునిద్ర పోతోందా? అని ప్ర‌శ్నించారు. `` నేను మీ భవిష్యత్‌ - నా బాధ్యత అని చెబుతుంటే.. జగన్‌ మాత్రం నా భవిష్యత్‌- మీ బాధ్యత అంటున్నారు. స్కీమాంధ్ర కావాలా..? స్కామాంధ్ర కావాలా..? అంటూ గత ఎన్నికల్లో ప్రజలకు పిలుపిచ్చిన మోడీ.. స్కాములు చేసిన వారిని వెనకేసుకొస్తున్నారు`` అని చంద్రబాబు మండిపడ్డారు.

జ‌గన్ నేరాలను ఈడీ నిర్ధారించినా.. సీబీఐ తొక్కి పెట్టిందని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ``కూకట్‌ప‌ల్లిలో ఇందూ ప్రాజెక్టుకు నిబంధనలు తొక్కి పెట్టి వంద ఎకరాల భూమిని ఇచ్చారు. వారి వద్ద నుంచి జగన్ 11 ఎకరాలు తీసుకున్నారు. దేశానికి కాపలదారుడని చెప్పుకుంటున్న మోడీ.. ఈ కేసును తొక్కి పెట్టారు. మోడీ దేశానికి కాపలాదారు కాదు.. దొంగలకు కాపలాదారు. డొల్ల కంపెనీల ద్వారా నగదు బదిలీలు చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారు. క్విడ్ ప్రోకోకు ఇంతకు మించిన ఆధారం దొరకదు. జగన్, విజయసాయిలకు చెందిన బినామీ కంపెనీ పేర్లతో అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అక్రమాన్ని స్వయంగా ఈడీనే నిర్ధారించింది` అని చంద్రబాబు స్పష్టం చేశారు.

నేరాలు చేయడంలో గ్రాండ్‌ మాస్టర్‌ అంటూ జగన్‌ను చంద్రబాబు విమర్శించారు. డేటా చోరీ విషయంలో యాక్షన్ ప్లాన్ కూడా రాసిచ్చేసి దొరికిపోయారు. రాజధానిలో తోటలు తగలబెట్టడం దగ్గర్నుంచి అన్ని రకాల నేరాలూ చేశారు. నేరాల్లో గ్రాండ్ మాస్టర్ జగన్. జగన్ చుట్టూ ఉన్న వాళ్లు కూడా నేరాలు చేయడంలో మాస్టర్ మైండ్స్. నేను పరిపాలనలో ఇన్నోవేషన్ ఉండాలంటే.. జగన్ నేరాల్లో ఇన్నోవేటీవ్ గా ఉంటున్నారు. టీడీపీ డేటా దొంగిలించడానికి ప్రయత్నించి జగన్‌ అడ్డంగా దొరికిపోయారని పేర్కొన్నారు. ఒక ప్లాన్‌ ప్రకారం పాయింట్ల వారీగా రాసుకుని మరీ టీడీపీపై కుట్ర చేశారన్నారు. ఈసీకి విజయసాయిరెడ్డి ఇచ్చిన లేఖలో వివరాలన్నీ ఉన్నాయని తెలిపారు. వైసీపీ, టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి ఈ డ్రామా నడిపారు` అని తెలిపారు. జగన్‌ జీవితం అడ్డదారి, వైసీపీది చెడుదారి అని వ్యాఖ్యానించారు. వ్యాపారం.. రాజకీయం రెండింటిల్లోనూ జగన్ ది అడ్డదారేనని అన్నారు. చట్టంలో ఎన్ని నేరాలున్నాయో అన్ని రకాల నేరాలు చేశారన్నారు. జగన్‌ ఇప్పటి వరకు ఆర్థిక నేరాలే చేశారని, కానీ ఇప్పుడు రాజకీయాల్లోనూ కొత్త నేరాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఇంతటి దివాళాకోరు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు.

ఏపీ డీజీపీ ఇంటిని అడ్డగోలుగా కూలదోయాలని కేసీఆర్‌ ప్రయత్నం చేశారని.. కూకట్‌పల్లిలో జగన్‌ దోచిన 11 ఎకరాలు ఎందుకు కనిపించలేదని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. మోడీ, జగన్‌తో కేసీఆర్‌ లాలూచీకి ఇదే నిదర్శనమన్నారు. కేసీఆర్‌..రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయాలనుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్‌ చేయని అవమానాలు లేవన్నారు. జగన్‌కు ఓటేస్తే మార్పు కాదు.. మరణశాసనమే అని చంద్రబాబు తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. జగన్‌ లాంటి వారందరికీ కాపలాదారు మహానాయకుడు కేసీఆర్‌ అన్నారు. ఏపీ డేటా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తలదూర్చిందన్నారు. తప్పులు చేసి తమని బ్లాక్‌మెయిల్‌ చేస్తారా అని ప్రశ్నించారు. ఏపీ అంటేనే చాలు కేసీఆర్ ఒంటి కాలి మీద లేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ పూర్తిగా కేసీఆర్‌కి కాల్మొక్కుతా నీ బాంచన్ అనే పరిస్థితికి వచ్చారన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English