ద‌క్షిణాదిపై ఆశ‌లు వ‌దిలేసిన మోడీ

ద‌క్షిణాదిపై ఆశ‌లు వ‌దిలేసిన మోడీ

సార్వ‌త్రిక ఎన్నికల షెడ్యూల్ విడుద‌లైపోయింది. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న విష‌యం తేలిపోయిన‌ట్టే. మొత్తం ఏడు విడ‌త‌ల్లో జ‌ర‌గ‌నున్న ఈ ద‌ఫా ఎన్నిక‌లు... ద‌క్షిణాదిలో మాత్రం తొలి మూడు ద‌శ‌ల్లోనే ముగియ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు మాత్రం ఏడు ద‌శ‌ల్లోనూ కొన‌సాగ‌నున్నాయి. ఉత్త‌రాదిలో కీల‌క రాష్ట్రాలుగా ఉన్న ఈ రెండు రాష్ట్రాల మ‌ధ్య సీట్ల సంఖ్య‌లో చాలా వ్య‌త్యాస‌మున్నా కూడా మొత్తం ఏడు ద‌శ‌ల్లో ఈ రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌రిగేలా వ్యూహం సిద్ధ‌మైపోయింది. ఇక ద‌క్షిణాది రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే... ఒక్క క‌ర్ణాట‌క మిన‌హా సింగిల్ ఫేజ్ లోనే ఈ రాష్ట్రాల ఎన్నిక‌లు ముగియ‌నున్నాయి.

ద‌క్షిణాదిలో ఐదు రాష్ట్రాలు ఉండ‌గా... ఒక్క క‌ర్ణాట‌క రాష్ట్రంలో రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా... మిగిలిన నాలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ‌, తెలంగాణ‌, కేర‌ళ‌ల్లో సింగిల్ ఫేజ్ లోనే ఎన్నిక‌లు ముగియ‌నున్నాయి. అది కూడా మొద‌టి ద‌శ‌లోనే. ఈ త‌ర‌హా వ్యూహం వెనుక చాలా పెద్ద ప్లానే ఉన్న‌ట్లుగా అప్పుడే విశ్లేష‌ణ‌లు మొద‌లైపోయాయి. ఈ ప్లాన్ ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఉత్త‌రాదిలో బీజేపీకి ప‌ట్టున్నంత‌గా దక్షిణాదిలో లేద‌నే చెప్పాలి. అలాంట‌పుడు ఎక్కువ టైం తీసుకోవ‌డం వ‌ల్ల ఆయా ప్రాంతీయ పార్టీల‌కు ఉప‌యోగం గాని... ఊసులో లేని బీజేపీకి ఉప‌యోగం లేదు. అదే టైం ఉత్త‌రాదిన వాడుకుంటే పార్టీకి కొంచెం క‌లిసొస్తుంద‌ని మోడీ ప్లాన్‌. దీంతో దక్షిణాది రాష్ట్రాల ఎన్నిక‌ల తంతును మొద‌ట  ఫేజ్‌లో ముగించేలా ప్లాన్ జ‌రిగిపోయింది.

బలం లేని ద‌క్షిణాది రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను తొలి ద‌శ‌ల్లోనే ముగిస్తే... మిగిలిన స‌మ‌యమంతా త‌మ‌కు బ‌ల‌మున్న ఉత్త‌రాది రాష్ట్రాలపైనే పెట్టుకునే వెసులుబాటు బీజేపీకి ల‌భించిన‌ట్టే. అయితే మ‌రి ద‌క్షిణాదిలోని ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల ఎన్నిక‌లను సింగిల్ ఫేజ్‌కే కుదించేయ‌గా... ఒక్క క‌ర్ణాట‌క‌లో మాత్రం రెండు ద‌శ‌ల ఎన్నిక‌లు ఎందుకంటే... ద‌క్షిణాదిలో బీజేపీకి అంతో ఇంతో బ‌ల‌మున్న రాష్ట్రం క‌ర్ణాట‌కే క‌దా. అందుకే క‌ర్ణాట‌క‌పై మ‌రింత‌గా దృష్టి సారించే అవ‌కాశం కోస‌మే... ఆ రాష్ట్రంలో రెండు విడ‌త‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగేలా మోదీ వ్యూహం ర‌చించినట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అమ్మ మోడీ!

Also Read:

ఎన్నిక‌ల షెడ్యూల్ పీకేకు చుక్క‌లేనా?

ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తోంది. ఊహించ‌ని విధంగా తొలివిడ‌త‌లోనే ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తున్న‌ట్లుగా ఈసీ ప్ర‌క‌టించ‌టం తెలిసింది. తొలి రౌండ్ లోనే ఎన్నిక‌ల్ని ఫేస్ చేయ‌టం తెలుగు రాష్ట్రాల‌కు అల‌వాటు లేదు.

ఎంత లేద‌న్నా రెండు.. మూడు ద‌శ‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని.. ఏప్రిల్ చివ‌ర్లో కానీ.. మే మొద‌టి వారంలో జ‌రుగుతాయ‌న్న అంచ‌నాకు భిన్నంగా మ‌రో 30 రోజుల్లో ఎన్నిక‌లు పూర్తి అయ్యేలా ఈసీ ప్ర‌క‌ట‌న ఉండ‌టం జ‌న‌సేన‌కు మ‌హా ఇబ్బందిగా మారుతుంద‌ని చెబుతున్నారు.

ఏపీలోని అధికార‌.. విప‌క్షం ఎన్నిక‌లు ఎప్పుడైనా స‌రే.. సై అన్న‌ట్లు సిద్ధంగా ఉంటే.. జ‌న‌సేన మాత్రం ఇంకా అంత స‌న్న‌ద్ద‌త‌లో లేద‌ని చెబుతున్నారు. తాజాగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ కార‌ణంగా జ‌న‌సేన‌కు మ‌హా ఇబ్బంది ఖాయ‌మంటున్నారు. ఏపీలో అంతో ఇంతో పార్టీ ఉనికి ఉంది కానీ.. తెలంగాణ‌లో అది కూడా లేదు. ఇప్ప‌టికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ నుంచి పోటీ చేస్తార‌న్న దానిపై క్లారిటీ లేదు. ఒక్క ప‌వ‌న్ మాత్ర‌మే కాదు.. ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసే ప్ర‌ముఖులు ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా లేరు. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ కు.. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి టీడీపీకి వెళ్ల‌ట‌మే కానీ.. జ‌న‌సేన‌ను నేత‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు.

ఏపీలోని మొత్తం స్థానాల‌కు జ‌న‌సేన అభ్య‌ర్థుల్ని పెట్ట‌గ‌ల‌దేమో కానీ.. బ‌ల‌మైన పోటీ ఇచ్చే నేత‌లు పెద్ద‌గా ఉండ‌ర‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. 30 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వ్య‌వ‌హారం ముగిసిపోనున్న నేప‌థ్యంలో.. ప‌వ‌న్ ఫోక‌స్ మొత్తం ఏపీ మీద‌నే పెట్టే అవ‌కాశం ఉంది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌న‌సేన పోటీ విష‌య‌మై స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఎన్నిక‌ల‌కు తాము స‌న్న‌ద్దంగా లేమ‌ని.. ఇంత వేగంగా తాము ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌లేమ‌ని.. అందుకే తెలంగాణ‌లో పోటీ చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. తాజా లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఇలాంటి మాట ప‌వ‌న్ నోటి నుంచి వెలువ‌డినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు. ఏపీలోనే పార్టీ పూర్తిస్థాయిలో లేని వేళ‌.. తెలంగాణ‌లో ఆ పార్టీ అభ్య‌ర్థుల్ని నిల‌ప‌టం సాధ్యం కానిదంటున్నారు. మొత్తంగా చూసిన‌ప్పుడు తాజా ఎన్నిక‌ల షెడ్యూల్ ప‌వ‌న్ కు ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌న‌టంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English