దిన‌క‌ర‌న్ పార్టీలో చేరిన ప్ర‌ముఖ సింగ‌ర్!

దిన‌క‌ర‌న్ పార్టీలో చేరిన ప్ర‌ముఖ సింగ‌ర్!

సినిమా వాళ్లు అన్నంత‌నే యాక్ట‌ర్లు గుర్తుకు వ‌స్తారే కానీ.. మిగిలిన శాఖ‌ల వారు పెద్ద‌గా గుర్తుకు రారు. న‌టులు త‌ప్పించి సాంకేతిక నిఫుణులు.. డ్యాన్స్ మాస్ట‌ర్లు.. సింగ‌ర్స్ లాంటి వాళ్లు రాజ‌కీయాల్లో రావ‌టం పెద్ద‌గా క‌నిపించ‌దు. త‌మ మ‌ద్ద‌తును కూడా బాహాటంగా ప్ర‌క‌టించ‌టానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు. కానీ.. తాజాగా సీనియ‌ర్ సింగ‌ర్.. తెలుగోళ్ల‌కు సుప‌రిచితుడు.. తెలుగు పాటల నేప‌థ్య గాయ‌కుడిగా ప్ర‌తిఒక్క‌రికి తెలిసిన మ‌నో తాజాగా రాజ‌కీయ పార్టీలో చేరారు.

అయితే.. ఆయ‌న చేరింది తెలుగు నేల మీద ఉన్న పార్టీల‌తో కాదు.. ఆయ‌న నివాసం ఉన్న త‌మిళ రాజ‌కీయ పార్టీల్లో చేర‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. స‌ర‌దాగా ఉండ‌టం.. హుషారు ఎక్కించేలా మాట్లాడ‌టం.. అంద‌రితోనూ స‌ర‌దాగా ఉండే త‌త్త్వం ఉన్న మ‌నో తాజాగా త‌మిళ‌నాడులోని దిన‌క‌ర‌న్ కు చెందిన ఏఎంఎంకే పార్టీలో చేరారు. తాజాగా పార్టీ అధినేత దిన‌క‌ర‌న్  ను క‌లిసిన ఆయ‌న‌.. పార్టీ తీర్థం పుచ్చుకొని.. పార్టీ కండువా క‌ప్పించుకున్నారు.

గాయ‌కుడిగా.. ప‌లు టీవీ షోల‌కు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించే మ‌నో పొలిటిక‌ల్ ఎంట్రీ తాజాగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. సినీ ప్ర‌ముఖులు దాదాపుగా అధికారానికి చేరువ‌య్యే పార్టీలో చేర‌టం క‌నిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా మ‌నో తీసుకున్న రాజ‌కీయ నిర్ణ‌యం ఇప్పుడు ప‌లువురిని ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English