అరెస్ట్‌, విడుదల ఎందుకీ హంగామా?

అరెస్ట్‌, విడుదల ఎందుకీ హంగామా?

కాంగ్రెసు పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు, మంత్రిగా గతంలో పనిచేసిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకరరావుని సిఐడి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. కాని అంతలోనే ఆయనను బెయిల్‌పై విడుదల చేసినట్లు సిఐడి అధికారులు వెల్లడించారు. తనను అరెస్టు చేయకుండా ఇదివరకే శంకరరావు ముందస్తు బెయిల్‌ పొందడంతోనే ఇది సాధ్యమయ్యింది. గ్రీన్‌ ఫీల్డ్స్‌ భూముల వివాదంలో శంకరరావు ఇరుక్కున్నారు. 

అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ భూముల్ని కాజేయాలని ప్రయత్నిస్తున్నారని గ్రీన్‌ ఫీల్డ్స్‌ కాలనీ వాసులు కోర్టును ఆశ్రయించగా, కేసు నమోదయ్యింది. అది అసలు వివాదం. ఇదివరలో ఓ సారి ఆయనను అరెస్టు చేయాలని సిఐడి ప్రయత్నించినప్పటికినీ అది కుదరలేదు, ఆ సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించగా, శస్త్ర చికిత్స జరిగిన అనంతరం కోలుకుని వచ్చాక కూడా చాలా డ్రామా నడిచింది పోలీసులకు శంకరరావుకి మధ్య. అది పెద్ద గందరగోళంగా మారింది, ఇప్పుడది అరెస్టు, విడుదలతో కొంత సద్దుమణిగిందని చెప్పవచ్చునేమో.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English