రాహుల్ క్లాస్ తీసుకుంటాడా...టీ కాంగ్రెస్ నేత‌ల్లో కొత్త టెన్ష‌న్‌

రాహుల్ క్లాస్ తీసుకుంటాడా...టీ కాంగ్రెస్ నేత‌ల్లో కొత్త టెన్ష‌న్‌

కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల నేప‌థ్యంలో, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. సాయంత్రం 5.30 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి రాహుల్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 6 గంటలకు క్లాసిక్‌ కన్వెన్షన్‌ పక్కన ఉన్న మైదానంలో నిర్వహించే కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. సాయంత్రం 6.30 గంటల తరువాత సభ నుంచి తిరిగి ఎయిర్‌పోర్టుకు బయల్దేరతారు.

అయితే, కాంగ్రెస్ పార్టీ చీఫ్ సంద‌ర్భంగా ఆ పార్టీ నేత‌ల్లో టెన్ష‌న్ మొద‌లైంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఆ పార్టీ నేత‌ల‌కు క‌ల‌వ‌ర పెడుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాల అనంత‌రం నుంచి కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకూ పడిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీ నుంచి మొత్తం 19 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించిన దరిమిలా కాంగ్రెస్ బలం 17కు చేరింది. తాజాగా చిరుమర్తి కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు మరో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే హస్తం పార్టీని వీడనున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో కాంగ్రెస్ గ్రాఫ్ 15 మంది ఎమ్మెల్యేలకు పడిపోతుంది.

ఎంతో నమ్మకంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్‌కు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్‌ల మీద షాకులిస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ విషయమై ఆరాతీసే అవకాశముందని స‌మాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారుతున్నారని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని సంకట స్థితిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులున్నారు. ఇదే అదనుగా మరో వర్గం రాష్ట్రంలో పార్టీ నాయకత్వ మార్పునకు డిమాండ్ చేయవచ్చుననే వాదనలూ వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English