కాంగ్రెస్‌కు షాక్‌....ఇండిపెండెంట్‌గా బ‌రిలోకి సుమ‌ల‌త‌

కాంగ్రెస్‌కు షాక్‌....ఇండిపెండెంట్‌గా బ‌రిలోకి సుమ‌ల‌త‌

క‌ర్నాట‌క‌లో ఆయా పార్టీల మ‌ధ్య  రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్యా లోక్ సభ స్థానం నుంచి మాజీ మంత్రి అంబరీష్ భార్య,నటి సుమలత కాంగ్రెస్ తరపున బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. మండ్య లోక్ సభ స్థానాన్ని జేడీఎస్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అంత‌కుముందు, కాంగ్రెస్ కర్నాటకలోని మాండ్యా సీటును కేటాయిస్తుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ప‌రిణామాలు మారాయి.

లోక్‌స‌భ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో, కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్యతో సుమలత సమావేశమై తన రాజకీయ ప్రవేశం గురించి చర్చించారు. సమావేశం అనంతరం మాట్లాడిన సుమలత..మండ్యా లోక్ సభ స్థానం నుంచి తానను  పోటీ చేయమని అంబరీష్ అభిమానులు కోరుతున్నారని, తనకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్‌ని కోరినట్లు ఆమె తెలిపారు. అయితే జేడీఎస్-కాంగ్రెస్ కూటమిలోని కొందరు ముఖ్య నాయకులు ఆమెకు కూటమి తరపున సీటు ఇవ్వడం లేదని తెలిపారు. కర్నాటక సంకీర్ణ కూటమి అధినేత సిద్ధరామయ్య అలాంటి ఆలోచన ఏదీ లేదని ఇటీవల కొట్టిపారేశారు.  దీంతో, ఎలాగైనా మండ్యా నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగాలని సుమలత భావించారు.

సుమ‌ల‌త ఆకాంక్ష‌కు అనుగుణంగా, తాజాగా మాండ్యాలో పోస్టర్లు వెలిశాయి. ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుందని వాటిలోని సారాంశం. అంబరీశ్ అభిమానులు వాటిని వేశారు. సుమలత అభ్యర్థిత్వాన్ని సమర్థించినందుకు పార్టీ అధినాయకత్వం తమకు చీవాట్లు పెట్టిందని మాండ్యా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సుమలతకు మద్దతు కొనసాగిస్తే క్రమశిక్షణ చరలు తప్పవని కూడా బెదిరించారట. కొందరు మాత్రం ఏం జరిగినా అంబరీశ్ కుటుంబం వెంటే ఉంటామని అంటున్నారు. మరోవైపు సుమలత మాండ్యా కాంగ్రెస్ నాయకులతో సమావేశాలు, దేవాలయాల యాత్ర జోరుగా కొనసాగిస్తున్నారు. శ్రీరంగపట్న పర్యటనలో భాగంగా బుధవారం ఆమె రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ అధినాయకత్వం తనకు మాండ్యా సీటు కేటాయించపోతే ఆమె నిజంగానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English