ధనుష్ కి ఆ హీరోయిన్లే కావాలా

ధనుష్ కి ఆ హీరోయిన్లే కావాలా

తమిళ కథానాయకుడు ధనుష్ ఎప్పుడూ హీరో లాగా కనిపించడు. ఇప్పటికీ గడ్డం తీస్తే టీనేజీ కుర్రాడిలా కనిపించే అతను వెరైటీ క్యారెక్టర్లతో ఆశ్చర్యపరుస్తుంటాడు. ధనుష్ పక్కన చాలామంది హీరోయిన్లు పెద్ద వాళ్లలా కనిపిస్తారు. అతడి తొలి సినిమా ‘తుళ్లువదో ఎలమై’ నుంచి చాలా చిత్రాల్లో హీరోయిన్లు అతడి కంటే పెద్ద వయస్కులుగానే కనిపించారు.

తన కంటే తక్కువ వయస్కులే తన కంటే పెద్దగా కనిపించినపుడు.. తన కన్నా ముదురు హీరోయిన్లను పెట్టుకుంటే ఎలా ఉంటుంది? కానీ ధనుష్ చాలాసార్లు ఇలాగే చేశాడు. స్నేహ, శ్రియ లాంటి సీనియర్ హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. ఇప్పుడు మరోసారి అతను ముదురు హీరోయిన్లతో జోడీ కడుతున్నాడు. ధనుష్ ఇటీవలే ‘అసురన్’ పేరుతో ఒక కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో మలయాళ హీరోయిన్ మంజు వారియర్ ఓ కథానాయికగా నటిస్తోంది. ముందు ఈ చిత్రానికి మంజును కథానాయికగా ప్రకటించినపుడు ధనుష్‌కు జోడీ అని ఎవరూ అనుకోలేదు. కానీ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే కానీ తెలియలేదు.. వీళ్లిద్దరూ హీరో హీరోయిన్లే అని. ధనుష్ కంటే ఆమె ఐదేళ్లు పెద్ద కావడం గమనార్హం. ఐతే ఈ సినిమాలో ఒక ముదురు హీరోయిన్ సరిపోదని ఇంకొకరిని తీసుకుంటున్నారు. ఆమె మరెవరో కాదు.. స్నేహ. ఆమె కూడా ధనుష్ కన్నా పెద్దది. ఇద్దరికీ అసలు జోడీనే కుదరదు.

ఐతే ‘పుదుప్పేట్టై’ (తెలుగులో ధూల్ పేట) సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. అందులో స్నేహను అతడి కంటే పెద్దదానిగానే చూపిస్తారు. ఆ సినిమాకు అది సెట్టయిపోయింది. ఐతే ఇప్పుడు మరోసారి ఇద్దరూ జోడీ కడుతున్నారు. మరి ఇందులో ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ధనుష్‌తో ‘పొల్లాదవన్’.. ‘ఆడుగళం’.. ‘వడ చెన్నై’ లాంటి కల్ట్ మూవీస్ అందించిన వెట్రిమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English