ఓవైసీ మాటఃటీఆర్ఎస్‌,వైసీపీ గెలిస్తే...ఢిల్లీని శాసించొచ్చు

ఓవైసీ మాటఃటీఆర్ఎస్‌,వైసీపీ గెలిస్తే...ఢిల్లీని శాసించొచ్చు

ఎంఐఎం 61వ ఆవిర్భావ వేడుకల సంద‌ర్భంగా ఆ పార్టీ అధినేత‌, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నగరంలోని దారుసలాంలో ఆవిర్భావ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న సంద‌ర్భంగా పాల్గొన్న అస‌ద్ మాట్లాడుతూ, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్, వైసీపీ కలిసి తెలుగు రాష్ర్టాల్లో 35 సీట్లు సాధిస్తే చాలన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ 16 ఎంపీ సీట్లు సాధిస్తుందన్నారు. జగన్ అడిగితే ఏపీలో వైసీపీ తరపున ప్రచారం చేస్తానన్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు కాసుకోవాల‌ని ఓవైసీ వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా పాకిస్థాన్‌పై మ‌రోమారు ఓవైసీ మండిప‌డ్డారు. ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కమాండర్ అభినందన్ విషయంలో రాజకీయం చేయొద్దన్నారు. ఇస్లాం పేర్లు పెట్టుకున్న అన్ని సంస్థలకు తాము మద్దతు ఇచ్చినట్లు కాదన్నారు. కొందరు ముస్లిం మతాన్ని బద్నాం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వింగ్ క‌మాండ‌ర్‌ అభినంద‌న్‌ను రిలీజ్ చేస్తామ‌ని పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అక్క‌డి పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో ఆయ‌న‌.. మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి బ‌హ‌దూర్ షా జాఫ‌ర్‌, మైసూర్ రాజు టిప్పు సుల్తాన్‌ల గురించి త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ఇమ్రాన్ త‌న‌కు తాను హీరో టిప్పు సుల్తాన్‌తో పోల్చుకున్నారు. దీన్ని ఎంఐఎం పార్టీ చీఫ్ అస‌దుద్దీన్ ఓవ‌సీ త‌ప్పుప‌ట్టారు. టిప్పు సుల్తాన్ హిందూ మ‌త‌స్తుల‌కు శ‌త్రువుకాద‌న్నారు. ఆ చ‌క్ర‌వ‌ర్తి కేవ‌లం త‌న రాజ్య వ్య‌తిరేకుల‌కు మాత్ర‌మే శ‌త్రువ‌న్నారు. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ అణుబాంబుల గురించి మాట్లాడుతున్నార‌ని, ఆ బాంబులు ఇక్క‌డ కూడా ఉన్నాయ‌న్నారు. మీరు మీ ల‌ష్క‌రే సైతాన్‌, జైషే సైతాన్‌ల‌ను నియంత్రించాల‌న్నారు. స‌రిహ‌ద్దులు దృఢంగా ఉంటేనే దేశంల బ‌లంగా ఉంటుంద‌ని అస‌ద్ అన్నారు.

పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన రెండు మూడు రోజుల్లోనే భారత్ ఇలాంటి దాడి చేస్తుందని ఊహించానని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సర్జికల్ దాడులను స్వాగతిస్తున్నామని, ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పారు. పాక్ ప్రతిదాడికి దిగితే ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉండాలి. వైమానిక దళం చేసిన దాడిని స్వాగతిస్తున్నాం. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం సంతోషకరం. ఉగ్రదాడులకు భారత్ గట్టి జవాబు ఇచ్చింది. మసూద్ అజహర్, హఫీజ్ సయిద్‌లను కూడా ఏరిపారేయాలని ఓవైసీ అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English