2 నెల‌ల్లో హైద‌రాబాద్ ఇంటికి బాబు వెళ్ల‌టమే!

2 నెల‌ల్లో హైద‌రాబాద్ ఇంటికి బాబు వెళ్ల‌టమే!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్.. న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. తాజాగా జ‌గ‌న్ కొత్తింటి గృహ‌ప్ర‌వేశ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఆమె మీడియాతో మాట్లాడారు.ఈ సంద‌ర్భంగా ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ కొత్తింటి నిర్మాణం ఎందుకు జ‌రిపార‌న్న విష‌యాన్ని చెబుతూ.. నింద‌లు వేసినందుకు జ‌గ‌న్ రాజ‌ధానిలో ఇంటిని.. పార్టీ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేసుకోలేద‌న్న ఆమె.. అమ‌రావ‌తి కేంద్రంగా పార్టీ కార్య‌క‌లాపాలు సాగించేందుకే నిర్మించుకున్న‌ట్లు చెప్పారు.

జ‌గ‌న్ కు అధికారం వ‌స్తే రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి త‌ర‌లిస్తారంటూ టీడీపీ నేత‌లు.. ఎల్లో మీడియా ప్ర‌చారం చేసింద‌న్న ఆమె.. అమ‌రావ‌తిలో వైఎస్ జ‌గ‌న్ స్థిర నివాసం.. పార్టీ కార్యాల‌య నిర్మాణాలు ఎల్లో మీడియాకు చెంప‌పెట్టు లాంటివని మండిప‌డ్డారు.

ఐదేళ్లు అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు రాజ‌ధానిలో స్థిర నివాసం కానీ.. పార్టీ కార్యాల‌యం కానీ ఏర్పాటు చేయ‌క‌పోవ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మైన అంశంగా ఆమె చెప్పారు. ఏపీకి జ‌గ‌న్ ప‌ర్మినెంట్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని.. చంద్ర‌బాబు టెంప‌ర‌రీ సీఎంగా అభివ‌ర్ణించారు. రెండునెల‌ల్లో చంద్ర‌బాబు హైద‌రాబాద్ లోని త‌న ఇంటికి షిఫ్ట్ అవుతార‌న్న ఆమె.. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశాన్ని చెప్పారు.

తాజాగా గృహ‌ప్ర‌వేశం జ‌రిపిన జ‌గ‌న్ ఇంటికి పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు.. అభిమానులు అంద‌రికి ఆహ్వానాలు అందాయ‌ని.. కానీ బాబు నిర్మించిన ఇంట్లోకి మాత్రం పార్టీ ఎంపీలు.. ఎమ్మెల్యేల‌కు కూడా ప్ర‌వేశం లేద‌ని చెబుతూ.. ఇరువురి నేత‌ల మ‌ధ్య తేడాను ఆమె చెప్పారు.

విభ‌జ‌న త‌ర్వాత క‌ట్టుబ‌ట్ట‌ల‌తో హైద‌రాబాద్ ను విడిచి వ‌చ్చిన‌ట్లుగా చెప్పుకునే చంద్ర‌బాబు అమ‌రావ‌తిలో ఇప్ప‌టివ‌ర‌కూ స్థిర నివాసాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదో చెప్పాల‌న్నారు.జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల్ని కాపీ చేసిన చంద్ర‌బాబు.. త‌మ అధినేత మాదిరే రాజ‌ధానిలో ఎందుకు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేదో చెప్పాల‌న్నారు. బాబు మాట‌ల మ‌నిషిగా ఆమె చెప్పారు. ఏ మాట‌కు ఆ మాటే.. రోజా మాట‌ల్లో చాలా వ‌ర‌కూ అవునుక‌దూ.. బాబు ఇలా ఎందుకు చేసిన‌ట్లు? అన్న క్వ‌శ్చ‌న్ మ‌దిలో మెద‌ల‌క మాన‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English