రాకేష్ సంచ‌ల‌న‌ దందాలు...అందుకే జ‌యరాం మ‌ర్డ‌ర్‌

రాకేష్ సంచ‌ల‌న‌ దందాలు...అందుకే జ‌యరాం మ‌ర్డ‌ర్‌

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసు అధికారుల విచారణ ముగిసింది. మూడున్నర గంటల పాటు ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాస్‌ను దర్యాప్తు అధికారి కేఎస్ రావ్ ప్రశ్నించారు. రాకేశ్ రెడ్డి సమాధానాలు, పోలీసుల సమాధానాలను అధికారులు బేరీజు వేసుకుంటున్నారు. ఈసందర్భంగా డీసీపీ శ్రీనివాస్ జయరాం హత్య కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.

జయరాం హత్యకేసులో ముగ్గురు పోలీసు అధికారులను విచారించామ‌ని డీసీపీ తెలిపారు. `ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్, రాంబాబులను విచారించాం. కేసుకు సంబంధించి అధికారుల నుంచి ప్రతీ విషయం తెలుసుకున్నాం. హత్య జరగకముందు, జరిగిన తర్వాత కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించాం. రాకేష్‌రెడ్డి తన స్నేహితుల మధ్య గొడవ విషయాన్ని మాత్రమే.. ఫోన్ కాల్‌లో తనకు చెప్పాడని ఏసీపీ మల్లారెడ్డి చెప్పాడు. విచారణ పారదర్శకంగా జరుగుతోంది. హత్య కేసులో పోలీసుల పాత్ర ఉందని తెలిస్తే చర్యలు తీసుకుంటాం. జయరాంను రాకేష్‌రెడ్డి హత్య చేశాడని మీడియాలో వచ్చే వరకు తమకూ తెలియదని పోలీసు అధికారులు చెబుతున్నారు. రాయదుర్గం సీఐ ఫోన్‌ కాల్ తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులకు రాకేశ్ ఫోన్ చేశాడు. హత్య జరిగిన తర్వాత రాజకీయ నేతలతో రాకేష్‌రెడ్డి మాట్లాడలేదు. 53 ఎకరాల కబ్జాలో 6 ఎకరాలు కబ్జా చేయాలని రాకేశ్ రెడ్డి ప్రయత్నం చేశాడు` అని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

ఇదిలాఉండ‌గా, జ‌య‌రాం హ‌త్యాకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్‌రెడ్డిని సంబంధించిన షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా రాకేష్‌రెడ్డి భూ దందాలు బయటపడ్డాయి. రాకేష్ రెడ్డి హైదరాబాద్ శివారు ప్రాంతంలో భూ కబ్జాలకు పాల్పడ్డాడని పోలీసులు గుర‌త్ఇంచారు. పోలీసులు, పొలిటికల్ లీడర్లతో కలిసి భూకబ్జాలు చేశాడు. ఓఆర్‌ఆర్ సమీపంలోని కొంగరకలాన్ గ్రామంలో ఆరు ఎకరాల భూమిని రాకేష్‌రెడ్డి కబ్జా చేసినట్టు తెలుస్తోంది. లింగంరెడ్డి అనే వ్యక్తి ల్యాండ్‌ను రాత్రికి రాత్రే కబ్జా చేసింది రాకేష్‌రెడ్డి గ్యాంగ్... భూమి దగ్గర ఉన్నవాళ్లను కత్తులు, తుపాకులతో బెదిరించి కబ్జాకు పాల్పడ్డాడు. దీనిపై ఏసీపీ మల్లారెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు... పైగా రాకేష్‌రెడ్డికి ఏసీపీ పూర్తిగా సపోర్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో లింగంరెడ్డి... డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇదే కాకుండా రాకేష్‌రెడ్డికి చాలా మంది పోలీసులతో ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English