తెలుగుదేశం యువ ‘జపం’

తెలుగుదేశం యువ ‘జపం’

తెలుగుదేశం పార్టీ యువ జపం చేస్తున్నది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుమారుడైన నారా లోకేష్‌ మహానాడులో కలివిడిగా తిరుగుతున్న తీరు, యువతరం నేతలతో ఆయన సంభాషిస్తున్న తీరు చూసి తెలుగు తమ్ముళ్ళు అచ్చెరువొందుతున్నారు. లోకేష్‌తో దేవేందర్‌గౌడ్‌ కుమారుడు, ఎర్రన్నాయుడు కుమారుడు, అయ్యన్నపాత్రుడు కుమారుడు, పరిటాల రవి కుమారుడు.. ఇలా యువ నేతలంతా ఓ టీమ్‌గా కనిపించారు.

అనధికారికంగా చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని లోకేష్‌ కొనసాగిస్తారని ఆ పార్టీలోనే ఓ ప్రచారం జరుగుతున్నది. అందుకే యువ నేతలంతా లోకేష్‌ వెంట కనిపిస్తున్నారు. యంగ్‌ జనరేషన్‌ ఆలోచనలు తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికలలో ఎంత లాభం చేకూర్చుతాయోగాని, వలసలతో కుదేలైన తెలుగుదేశం పార్టీ యువనేతలతో కొంచెం కళకళ్ళాడుతున్నట్టుగా కనిపిస్తున్నది మహానాడులో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు