సానియా ఆ స్టేట్మెంట్ ఎందుకిచ్చింది?

సానియా ఆ స్టేట్మెంట్ ఎందుకిచ్చింది?

సానియా మీర్జా ఏం చేసినా వార్తే.. ఏమీ చేయకున్నా వార్తే.. ఇటీవలే పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిపై సానియా మీర్జా వెంటనే స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. ఆమె పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఐతే భారత్, పాకిస్థాన్ మధ్య ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా.. సానియా సోషల్ మీడియా జనాల టార్గెట్ అయిపోతుంటుంది. షోయబ్ ఆమె భర్త అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆమెను ట్రోల్ చేస్తుంటారు.

పుల్వామా దాడి నేపథ్యంలోనూ సానియా పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమెను దారుణంగా తిట్టిపోశారు. దీనికి తోడు సానియా వెంటనే ఉగ్ర దాడిని ఖండించకపోవడంతో ట్రోలింగ్ మరింత ఉద్ధృతంగా సాగింది. ఐతే కొన్ని రోజులు ఓపిక పట్టిన సానియా.. ఒక లెంగ్తీ స్టేట్మెంట్ ఇచ్చింది. తనను ట్రోల్ చేస్తున్న వారికి దీటుగా బదులిచ్చింది.

ఉగ్రవాదుల దాడిలో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని.. కచ్చితంగా ఈ దాడిని ఖండించాల్సిందే అని సానియా అంది. ఉగ్రవాదాన్ని ఎవ్వరూ అంగీకరించరని.. తాను కూడా అంతేనని అంది. ఐతే ఈ విషయంపై సోషల్ మీడియాలో గొంతు చించుకుని అరవాల్సిన అవసరం లేదని.. స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన పని లేదని ఆమె అంది. దాని బదులు జవాన్లకు సాయ పడేలా ఏమైనా చేయాలని సానియా అంది. తాను సైలెంటుగా అదే పని చేస్తున్నానని.. కబుర్లు మాని మీరూ వీలైతే ఏమైనా చేయాలని.. అంతే తప్ప సెలబ్రెటీల మీద ఇలా విషం చల్లడం సమంజసం కాదని అంది.

తాను దేశాన్ని ప్రేమించే అమ్మాయినని.. దేశం కోసం ఆడుతున్నానని.. దేశానికే తన తొలి ప్రాధాన్యం అని సానియా చెప్పింది. ఊరికే హేట్ మెసేజ్‌లు పెట్టడం మాని.. సైనికుల కుటుంబాల కోసం ప్రార్థించాలని.. వారికి ఏ విధంగానైనా తోడ్పాటు అందించే ప్రయత్నం చేయాలని ఆమె హితవు పలికింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English