ర‌జనీ కీల‌క ప్ర‌క‌ట‌న..పోటీకి దూరం

ర‌జనీ కీల‌క ప్ర‌క‌ట‌న..పోటీకి దూరం

సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాల కన్నా ఆయన పొలిటికల్ ఎంట్రీపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. జయలలిత మరణం తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్‌హాసన్, రజనీకాంత్ తమిళ రాజకీయాలలో కీలకంగా మారనున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్ప‌టికే కమల్ త‌న‌ పార్టీ పేరు ఎజెండా ప్ర‌క‌టించ‌గా, ర‌జ‌నీకాంత్ త‌న పార్టీకి ‘మక్కల్ మంద్రమ్’ అనే పేరుని పెట్టారు. వచ్చే ఎన్నికల్లో 234 స్థానాల్లో తమ పార్టీ తరుపున అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు ర‌జ‌నీ ప్ర‌క‌టించాడు.  అయితే, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు త‌న పార్టీ వైఖ‌రిని ప్ర‌క‌టించ‌ని ర‌జ‌నీకాంత్ తాజాగా కీల‌క క్లారిటీ ఇచ్చాడు.

గ‌త ఏడాది న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన ర‌జనీకాంత్ డిసెంబ‌ర్ 12,2018న త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా పార్టీ పేరు ప్ర‌క‌టిస్తాడ‌ని అనుకున్న ఇప్పటి వ‌ర‌కు అది జ‌ర‌గ‌లేదు. ఇంకా పార్టీకి సంబంధించి ముమ్మ‌రంగా ప‌నులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో పార్టీ పేరు ప్ర‌క‌టించ‌డంలో జాప్యం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ర‌జనీ రానున్న లోక్‌స‌భ ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తాడా లేదా అనే దానిపై అభిమానుల‌లో ప‌లు సందేహాలు నెల‌కొన్న త‌రుణంలో తాజాగా క్లారిటీ ఇచ్చారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో తాను పోటీ చేయ‌న‌ని, ఏ పార్టీకి కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని ప్ర‌క‌టించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. నా పేరు, గుర్తు ఎవ‌రు వాడ‌కూడ‌దు . స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే బ‌ల‌మైన‌, సుస్థిర ప్ర‌భుత్వాన్ని ఎంచుకోండి అని త‌లైవా పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English