మెగా ఫ్యామిలీ అందరితో చేస్తాడా ఏంటి?

మెగా ఫ్యామిలీ అందరితో చేస్తాడా ఏంటి?

మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరితో సినిమా చేసినా కూడా దర్శకుల కెరీర్ కు ఒక దారి దొరికినట్లే.. మెగా కాంపౌండ్ లో ఒక సినిమాతో మెప్పిస్తే ఆ ఫ్యామిలీలో మిగతా వారితో సినిమాలు చేసేయడం చాలా ఈజీయే. అయితే ఇప్పుడు స్టార్ డైరక్టర్ సుకుమార్ ఇప్పుడు అలాంటి ప్రయోగాలు చేయల్సిన అవసరం లేదు గాని తన శిష్యులను మాత్రం మెగా కాంపౌండ్ కి టచ్ చేస్తున్నాడు.

బన్నీ ద్వారా గీతా ఆర్ట్స్ కి బాగా దగ్గరైన సుక్కు.. ఇప్పుడు రామ్ చరణ్ తో రంగస్థలం చేసి భారీ హిట్ కొట్టేశాడు. ఇక ఇప్పుడిపుడే ఎదుగుతున్న మెగా డాటర్ నిహారిక ను కూడా సుక్కు తన సినిమాలో కవర్ చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీలో నటిగా కొనసాగుతున్న ఏకైక స్టార్.. కొణిదెల నిహారికను ఇప్పుడు సుక్కూ ఒక సినిమాలోకి తీసుకున్నాడు. తన శిష్యుడికి స్క్రీన్ ప్లే డైలాగ్స్ ను అందించి ఒక కథను సెట్ చేయించి.. గీత ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్ తో కలిసి సుకుమార్ నిర్మించబోయే ఈ సినిమాలో నిహారిక ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించబోతోందని టాక్.

ఇకపోతే ఇటీవలే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో సుక్కు రైటింగ్స్ లో ఒక ప్రాజెక్ట్ మొదలైన సంగతి తెలిసిందే. చూస్తుంటే దాదాపు మెగా ఫ్యామిలీలో అందరితో సుకుమార్ సినిమా చేస్తాడా ఏంటా అనిపిస్తోంది కదూ. ఇక ప్రస్తుతం నిహారిక సూర్యకాంతం అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతరం సుకుమార్ రైటింగ్స్ లో ప్రాజెక్ట్ మొదలుకానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English