సండ్ర‌కు షాక్: టీటీడీ ప‌ద‌వి నుంచి ఊస్ట్‌

సండ్ర‌కు షాక్: టీటీడీ ప‌ద‌వి నుంచి ఊస్ట్‌

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు! ఊగిస‌లాట‌లో ఉన్న ఎమ్మెల్యేకు ఊహించ‌ని షాక్ ఇచ్చారు!! తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సండ్ర వెంకట వీరయ్యకు షాకిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా సండ్ర వెంకటవీరయ్య నియామకాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్న‌ సండ్ర వెంక‌ట వీర‌య్య నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. మళ్లీ ఎన్నికల్లో గెలవడంతో.. ఆయన్ను సభ్యుడిగా నియమించారు. కొద్దిరోజులుగా ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించలేదనే చర్చ నడుస్తోంది. టీటీడీ నిబంధనల ప్రకారం పాలకమండలి సభ్యుడిగా నియామకం జరిగిన నెలరోజుల్లో బాధ్యతలు స్వీకరించాలి.

టీటీడీ నిబంధనల ప్రకారం పాలకమండలి సభ్యుడిగా నియామకం జరిగిన నెలరోజుల్లో బాధ్యతలు స్వీకరించాలి.. కాని సండ్ర స్వీకరించకపోవడంతో చర్యలు తప్పలేదు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమితులై రెండు నెలలైనా బాధ్యతలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం ఆయ‌న్ను ప‌దవి నుంచి తొల‌గిస్తూ...ఆదేశాలు వెలువ‌రించింది.

ఇదిలాఉండ‌గా, సండ్ర వెంక‌ట వీర‌య్య‌ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగతోంది. అందుకే పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించలేదనే చర్చ నడుస్తోంది. సండ్ర టీఆర్ఎస్‌లోకి వెళతారని తేలడంతోనే.. పాలకమండలి సభ్యత్వాన్ని రద్దు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై సండ్ర ఇప్పటి వరకు స్పందించలేదు. కాని వీరయ్య పార్టీ మారడం ఖాయమని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుండ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English