మంత్రుల తొలగింపుపై రాయపాటి హర్షం

మంత్రుల తొలగింపుపై రాయపాటి హర్షం

కళంకిత మంత్రులను తొలగించడాన్ని ఎంపి రాయపాటి సాంబశివరావు హర్షించారు. అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుందని రాయపాటి చెప్పారు. 2014 ఎన్నికలలో రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెసు పార్టీ ఇంకోసారి రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. జగన్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి తమ పదవులకు రాజీనామా చేయగా వారి రాజీనామాలు ఆమోదం పొందాయి.

వీరి రాజీనామాలు ఎప్పుడో ఆమోదం పొందాల్సి ఉన్నప్పటికినీ అధిష్టానం ఆదేశించాకనే రాజీనామాలు ఆమోదం పొందడం జరిగింది. దాంతో అధిష్టానం కళంకిత మంత్రులను తొలగించినట్లయ్యింది తప్ప, స్వచ్ఛందంగా ఆరోపణలు వచ్చినవారు రాజీనామా చేసినట్లుగా లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా మంత్రులనూ తొలగిస్తే కాంగ్రెసు పార్టీకి మంచిదని రాయపాటి అన్నారు. రాయపాటి ఉద్దేశ్యం ఆయన రాజకీయ ప్రత్యర్థి కన్నా లక్ష్మినారాయణ పదవి ఊడిపోవాలనే కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు