'దేవెగౌడ‌...త్వ‌ర‌లోనే మ‌ర‌ణిస్తాడు'

'దేవెగౌడ‌...త్వ‌ర‌లోనే మ‌ర‌ణిస్తాడు'

హాట్ హాట్ రాజ‌కీయాల‌కు వేదిక అయిన క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు నుంచి మొదలుకొని నేటి వ‌ర‌కు కూడా ఒక పార్టీని అధికారంలో నుంచి దించి మ‌రో పార్టీ అధికారంలోకి రావాల‌నే ఎత్తుగ‌డ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిప‌క్ష బీజేపీ ఎత్తుగ‌డ ఫ‌లితం ఇవ్వ‌క‌పోవ‌డం...బిక్కుబిక్కుమంటూ జేడీఎస్‌- కాంగ్రెస్ స‌ర్కారు అధికారంలో ఉండ‌టం మ‌నంద‌రికీ తెలిసిన సంగ‌తే. ఈ పొత్త‌ల ఎత్తులో, తాజాగా మ‌రో ఎపిసోడ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. రాజ‌కీయ వ్యాఖ్య‌ల్లో భాగంగా, మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎమ్మెల్యే  ప్రీతంగౌడ  మాజీ ప్ర‌ధాని గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో దేవెగౌడ మరణిస్తారు. కమారస్వామి పరిస్థితి కూడా బాగా లేదని జేడీఎస్ ఎమ్మెల్యే కొడుకు చెప్పాడు' అని బీజేపీ ఎమ్మెల్యే ప్రీతంగౌడ అన్నారు. బీజేపీ త్వరలో చరిత్ర సృష్టించనుందని కూడా ఆయన అన్నట్లు భావిస్తున్న ఆడియో రికార్డుల క్లిప్ లీకైంది.

ఈ ఆడియో రికార్డుల క్లిప్ టీవీ చానెళ్లలో ప్రసారం కాగానే అధికార జేడీఎస్ కార్యకర్తలు హసలోని ప్రీతంగౌడ ఇంటిపై దాడి చేశారు. దీంతో, బీజేపీ మద్దతుదారుడికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేసి జేడీఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు.

ఇదిలా ఉండ‌గా, ఈ దాడిపై దీనిపై విపక్ష నేత యడ్యూరప్ప మండిపడ్డారు. క‌ర్ణాట‌క స‌ర్కారు అస్థిరంగా మారిపోయింద‌ని ఇందులో భాగంగా, కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో త‌మ‌ను టార్గెట్ చేస్తోంద‌న్నారు. సీఎం కుమారస్వామి సంయమనం పాటించాలని పార్టీ కార్యకర్తలను కోరారు. బీజేపీకి అధికారం ద‌క్క‌లేద‌నే ఆవేద‌న ఎక్కువైంద‌ని అందుకే  ఇలా త‌ప్పుడు వ్యాఖ్య‌లు చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English